Sunday, January 19, 2025
Homeసినిమావిజ‌య్ దేవ‌ర‌కొండ 'ఖుషి'లో రెండో హీరోయిన్!

విజ‌య్ దేవ‌ర‌కొండ ‘ఖుషి’లో రెండో హీరోయిన్!

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌ల ‘లైగ‌ర్‘ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన లైగ‌ర్ మూవీ అంద‌రి అంచ‌నాల‌ను తారుమారు చేసి భారీ డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో విజ‌య్, పూరి చేయాల‌నుకున్న జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రం డౌట్ లో ప‌డింది. ప్ర‌స్తుతం  శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఖుషి అనే సినిమా విజ‌య్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది.

ఇందులో విజ‌య్ స‌ర‌స‌న స‌మంత న‌టిస్తుంది. ఓ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. అయితే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఓ స్పెషల్ రోల్ చేయబోతుందట‌. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు రాశి ఖన్నా అని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం సెకండాఫ్ లో వచ్చే ఓ కీలక పాత్రలో నటిస్తోందట. పైగా రాశి ఖన్నా క్యారెక్టర్ చాలా వినూత్నంగా ఉండబోతుందని స‌మాచారం.

నెగిటివ్ షేడ్స్ తో సాగే ఈ క్యారెక్టర్ చివరకు ఎమోషనల్ గా ఎలా టర్న్ తీసుకుంది ? లవ్ విషయంలో పూర్తి పాజిటివ్ క్యారెక్టర్ గా ఎలా మారింది ? అనే కోణంలో రాశి ఖన్నా పాత్ర సాగుతుంద‌ని స‌మాచారం. మ‌రి.. డియ‌ర్ కామ్రేడ్, లైగ‌ర్ చిత్రాల‌తో వ‌రుస‌గా ఫ్లాప్స్ చూసిన విజ‌య్ ఖుషి సినిమాతో స‌క్సెస్ సాధించి ఫామ్ లోకి వ‌స్తాడేమో చూడాలి.

Also Read: లైగ‌ర్ ఫ్లాప్ సోష‌ల్ మీడియాకు బ్రేక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్