Saturday, January 18, 2025
Homeసినిమానెట్ ఫ్లిక్స్ లోకి అడుగుపెడుతున్న 'మిస్టర్ బచ్చన్'

నెట్ ఫ్లిక్స్ లోకి అడుగుపెడుతున్న ‘మిస్టర్ బచ్చన్’

రవితేజ కథానాయకుడిగా రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’, ఆగస్టు 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. విశ్వప్రసాద్ – భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. రవితేజ – హరీశ్ శంకర్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. ఇద్దరికీ మాస్ ఇమేజ్ ఒక రేంజ్ లోనే ఉంది. అందువలన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు ఉండేవి. మాస్ ఆడియన్స్ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిని చూపించారు. రవితేజకి ఈ సినిమా హిట్ ఇవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు.

ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె గ్లామర్ యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ సినిమాలో జగపతిబాబు ప్రతినాయకుడిగా కనిపిస్తాడు. ఆయన విలనిజం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని భావించారు. మిక్కి జె మేయర్ అందించిన కొన్ని బాణీలు ఆకట్టుకున్నాయి. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ‘నెట్ ఫ్లిక్స్’ వారు దక్కించుకున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారిక పోస్టర్ ను వదిలారు.

రవితేజ ఈ సినిమాలో ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా నటించాడు. కొన్ని కారణాల వలన సస్పెన్షన్ కి గురైన ఆయన తన సొంత ఊరుకి చేరుకుంటాడు. ఒకానొక సందర్భంలో ఆయనకి భాగ్యశ్రీ తారసపడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆ తరువాత హీరో తిరిగి డ్యూటీలో చేరడం .. అవినీతి పరుడైన విలన్ పై విరుచుకుపడటమే కథ. 1980 లలో నడిచే ఈ కథ .. ఆ కాలంనాటి కొన్ని విశేషాలతో కొంతవరకూ అలరిస్తుంది. ఓటీటీ వైపు నుంచి ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి మరి

RELATED ARTICLES

Most Popular

న్యూస్