Sunday, February 23, 2025
Homeసినిమారవితేజ‌ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం

రవితేజ‌ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం

Ravi Teja New Movie Shooting Started In The Surrounding Of Hyderabad :

‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బస్ట‌ర్ సాధించిన మాస్ మ‌హారాజ ర‌వితేజ 68వ సినిమాకు శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు.  సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌గా SLV సినిమాస్, ఆర్ టి టీమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా  రెగ్యుల‌ర్ షూటింగ్ గురువారం నుంచి హైదరాబాద్ పరిసరాల్లో ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్టర్ లో  ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం ముందు ర‌వితేజ అటువైపు తిరిగి కుర్చొని ఎదో టైప్ చేస్తున్న‌ట్టు చూపించారు. పోస్ట‌ర్‌లోని క‌నిపిస్తున్న‌ అగ్ని ర‌వితేజ పాత్ర యెక్క ఇంటెన్సిటిని చూపించే విధంగా ఉంది.

ప్రభుత్వ అధికారిగా ప్రమాణ స్వీకారం చేసిన పాత లేఖ, డెస్క్‌, టైప్‌రైటర్, ఫైల్స్ మొదలైనవాటిని మనం ఈ పోస్ట‌ర్లో గమనించవచ్చు. క్రియేటివ్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ రూపొంద‌బోతుంది. ర‌వితేజకు ఇది సరికొత్త పాత్ర అవుతుందని శ‌ర‌త్ మండ‌వ‌ అంటున్నారు.

ర‌వితేజ స‌ర‌స‌న ‘మ‌జిలి’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది. స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. కేఎల్ ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌. సినిమాటోగ్ర‌ఫి: స‌త్య‌న్ సూర్య‌న్, ఎడిట‌ర్‌: కేఎల్ ప్ర‌వీణ్‌, ఆర్ట్: సాయి సురేష్‌, పిఆర్ఓ: వంశీ- శేఖ‌ర్

Must Read : వెంక‌టేష్ ‘నార‌ప్ప’ కు U /A సర్టిఫికేట్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్