Saturday, January 18, 2025
Homeసినిమా20 ఏళ్లుగా రవితేజ ఆన్ డ్యూటీ: హీరో నాని  

20 ఏళ్లుగా రవితేజ ఆన్ డ్యూటీ: హీరో నాని  

On Duty: మొదటి నుంచి కూడా రవితేజ తన కెరియర్ విషయంలో దూకుడు చూపిస్తూనే వస్తున్నాడు. ఏడాదికి మూడు సినిమాలు చేయాలనే తన కాన్సెప్ట్ ను ఫాలో అవుతూనే వస్తున్నాడు. ఆయన తాజా చిత్రమైన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్నరాత్రి హైదరాబాదు .. ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. హీరో నాని చీఫ్ గెస్టుగా .. దర్శకుడు బాబీ స్పెషల్ గెస్టుగా ఈ ఈవెంట్ జరిగింది. కథానాయికలుగా నటించిన దివ్యాన్ష .. రజీషా విజయన్ తో పాటు, ఐటమ్ సాంగ్  చేసిన అన్వేషి కూడా ఈ ఈవెంట్ లో సందడి చేశారు.

నాని మాట్లాడుతూ .. ” రవన్నయ్య ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు ఆయన చిరజీవిగారికిని స్ఫూర్తిగా తీసుకున్నాడు. నాలాంటి వాళ్లందరూ రవన్నయ్యను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. తనకి ఇష్టమైన మెగాస్టార్ తో కలిసి నటించే ఛాన్స్ రవన్నయ్యకి వచ్చింది. ఆయన కారవాన్ లోకి రవన్నయ్య ఎంటరయ్యాడు. అలానే త్వరలోనే నేను కూడా రవన్నయ్య కారవాన్ లోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నాను. రవన్నయ్య 20 ఏళ్లుగా ఆన్ డ్యూటీలో ఉన్నాడు. ఆ విధంగా సినిమాపై ఆధారపడిన  కుటుంబాలను ఆయన ఎంతలా ఆదుకున్నారనేది మాటల్లో చెప్పలేం” అన్నాడు.

ఇక దర్శకుడు బాబీ మాట్లాడుతూ .. ” రవితేజ చాలా మంచి మనసున్నవాడు. ఎంతో మంది దర్శకులను ఆయన పరిచయం చేశారు. నన్ను దర్శకుడిగా పరిచయం చేయడం మాత్రమే కాదు .. నాకు ఫ్లాప్ వచ్చిన తరువాత కూడా కాల్  చేసి తనతో సినిమా చేసుకోమని ధైర్యం చెప్పారు. ఆయన సినిమా చేయవలసి నేను .. అది ఆపేసి ‘జై లవకుశ’ చేసుకుని వస్తానంటే .. ఓకే అంటూ భుజం తట్టిన గొప్ప మనసు ఆయన సొంతం” అంటూ చెప్పాడు. ఇక దర్శకుడు శరత్ మండవ మాట్లాడుతూ .. ” ట్విట్టర్ లు చూడకుండా థియేటర్ లో వెళ్లి సినిమా చూడండి. ట్విట్టర్ లలో పిట్టలు రెట్టలు మాత్రమే వేస్తాయి” అంటూ ఒక చురకేశాడు.

Also Read : ఇలాంటి పుకార్లు నాకేం కొత్త కాదే: రవితేజ   

RELATED ARTICLES

Most Popular

న్యూస్