మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో రూపొందుతోన్న చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటిస్తోంది. అయితే.. ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు. ఇటీవలే అయన షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
గతంలో వీరిద్దరూ కలిసి అన్నయ్య సినిమాలో సోదరులుగా నటించారు. తాజా మూవీలో కూడా వీరిద్దరూ అన్నదమ్ములుగా కనిపించనున్నారట. అయితే రవితేజ కాస్త నెగిటివ్ గా కనిపిస్తాడట. తల్లులు వేరు అయినా తండ్రి ఒకడే కావడంతో సవతి సోదరులుగా చిరంజీవి, రవితేజ నటిస్తున్నారట. అన్న చిరు అంటే.. రవితేజకు చిన్నప్పటి నుంచి కోపం ఉంటుందని, దానిని పొగొట్టడానికి చిరంజీవి ప్రయత్నిస్తుంటారని టాక్ వినిపిస్తోంది.
ఇక వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు హై ఓల్టేజ్ లో ఉంటాయట. ఈ సీన్స్ చూస్తే.. థియేటర్లో అభిమానులకు పూనకాలే అన్నట్టుగా ఉంటాయని తెలిసింది. బాబీ చిరంజీవి వీరాభిమాని కావడంతో ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడట. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.