Saturday, January 18, 2025
Homeసినిమా‘ఛాంగురే బంగారురాజా’లో గోదావరి వెటకారం: రవితేజ

‘ఛాంగురే బంగారురాజా’లో గోదావరి వెటకారం: రవితేజ

రవితేజ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్స్ లో రూపొందుతోన్న కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మిస్తున్నారు. కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు క్రియేటివ్ ప్రోడ్యూసర్స్. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రవితేజ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  శ్రీ విష్ణు,  దర్శకులు హరీష్ శంకర్, అనుదీప్, కృష్ణ చైతన్య, సందీప్ రాజ్, వంశీ, వెంకటేష్ మహా, నిర్మాత శరత్ మరార్, వివేక్ కూచిభొట్ల, ఎస్కేఎన్.. తదితరులు  పాల్గొన్నారు.  ఈ వేడుకలోనేట్రైలర్ ని లాంచ్ చేశారు.

రవితేజ మాట్లాడుతూ “ఛాంగురే బంగారురాజా’ టైటిల్ నాకు విపరీతంగా నచ్చేసింది. సతీష్ కథ చెబుతున్నపుడు దర్శకుడు పాత వంశీ గారు గుర్తుకు వచ్చారు. ఆయనతో ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా చేశాను. అలాంటి హ్యుమర్, ఈస్ట్ గోదావరి వెటకారం, కథ ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. మొదటి నుంచి సినిమా పై చాలా నమ్మకం వుంది. ఒక్క రోజు కూడా షూటింగ్ కి వెళ్ళలేదు. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక  విషయంలో దర్శకుడికి పూర్తి స్వేఛ్చ ఇచ్చాను. ఎందులోనూ కలుగజేసుకోలేదు. నేను నిన్ను,  కథను నమ్ముతున్నాను. నీకు నమ్మకం ప్రకారం నీకు నచ్చింది చెయ్ అని దర్శకుడితో చెప్పాను. నా నమ్మకం సెప్టెంబర్ 15న ప్రూవ్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మా ప్రొడక్షన్ టీం సినిమాకి కావాల్సింది సమకూర్చారు. మా టీం శ్వేత, శాలిని, ఆర్కే, శ్రీధర్, వింధ్యా రెడ్డి.. వీళ్ళంతా కలసికట్టుగా పని చేశారు. ఈ సినిమా విజయం సాధించి వారికి కూడా మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.  టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సెప్టెంబర్ 15న ఖచ్చితంగా సినిమాని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్