Sunday, January 19, 2025
Homeసినిమావాల్తేరు వీర‌య్య‌లో ర‌వితేజ న‌టిస్తున్నాడా? లేదా?

వాల్తేరు వీర‌య్య‌లో ర‌వితేజ న‌టిస్తున్నాడా? లేదా?

Its Rumor only: మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే.  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ఇందులో చిరంజీవి ప‌క్కా మాస్ క్యారెక్ట‌ర్ చేస్తుండ‌డం.. ఫ‌స్ట్ లుక్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో వాల్తేరు వీర‌య్య సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర చేస్తున్నాడ‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌చ్చాయి. ‘అన్న‌య్య’ త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తుండ‌డంతో ఈ సినిమా పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే… వేరే సినిమాల్లో బిజీగా  ఉండడంతో ఈ సినిమాకు రవితేజ నో చెప్పాడ‌ని, అయన స్థానంలో మ‌రో యాక్ట‌ర్ కోసం బాబీ ట్రై చేస్తున్నాడ‌ని టాలీవుడ్ లో టాక్ వినిపించింది.

ప్ర‌చారంలో ఉన్న వార్త వాస్త‌వ‌మేనా..?  కాదా..? అనేదానిపై ఆరా తీస్తే.. ర‌వితేజ ఈ సినిమాలో నటిస్తున్నారని,  ప్ర‌చారంలో ఉన్న వార్త అవాస్త‌వమని తెలిసింది. ఈ నెల 14 నుంచి షూటింగ్ లో ర‌వితేజ జాయిన్ అవుతున్నార‌ట‌. చిరు, ర‌వితేజలపై చిత్రీక‌రించే స‌న్నివేశాలు చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటాయ‌ని టాక్. సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల కానుంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్