Monday, February 24, 2025
HomeసినిమాChangure Bangaru Raja: రవితేజ చిన్న సినిమా ప్రయత్నం ఫలించేనా..?

Changure Bangaru Raja: రవితేజ చిన్న సినిమా ప్రయత్నం ఫలించేనా..?

రవితేజ చిన్న సినిమాలను, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆర్టీ టీమ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ పై రవితేజ నిర్మించిన చిన్న సినిమా ‘ఛాంగురే బంగారు రాజా’. విభిన్న కథాంశంతో రూపొందిన సినిమా ఇది. కార్తీక్ రత్నం హీరోగా నటించాడు. సతీష్ వర్మ ఈ చిత్రానికి డైరెక్టర్. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రవితేజ ముఖ్యఅతిథిగా హాజరై సినిమా పై ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేశాడు. దీంతో సినిమా పై కాస్త పాజిటివ్ టాక్ వచ్చింది.

సెప్టెంబర్ 15న రావాల్సిన ‘స్కంద’, ‘చంద్రముఖి 2’ చిత్రాలు వాయిదా పడడంతో ‘ఛాంగురే బంగారు రాజా’ చిత్రాన్ని సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ బాగానే ఉందనే టాక్ వచ్చింది. ఇప్పుడు చిన్న సినిమా అయినా.. కంటెంట్ బాగుంటే.. అందులో హీరో ఎవరు అనేది చూడడం లేదు.  ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మంచి విజయాన్ని అందిస్తున్నారు. రవితేజ ఈ మూవీ టీమ్ తో స్పెషల్ ఇంటర్ వ్యూ చేసి ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. మరి.. రవితేజ చిన్న సినిమా ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్