Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఐపీఎల్: కోల్ కతాపై బెంగుళూరు విజయం

ఐపీఎల్: కోల్ కతాపై బెంగుళూరు విజయం

IPL-2022: ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో కోల్ కతాపై బెంగుళూరు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత మ్యాచ్ లో రాణించిన దినేష్ కార్తీక్ ఈ మ్యాచ్ లోనూ చివరి ఓవర్లో సత్తా చాటి మరో నాలుగు బంతులుండగానే విజయం సాధించి పెట్టాడు. చివరి ఓవర్లో ఏడు పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతిని సిక్సర్ గా మలిచిన కార్తీక్ రెండో బంతిని ఫోర్ ద్వారా విన్నింగ్ షాట్ తో మ్యాచ్ ముగించాడు.

ముంబైలోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బెంగుళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగుళూరు బౌలర్లు హసరంగ, ఆకాష్ దీప్ లు రాణించడంతో కోల్ కతా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది, 14 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది, ఆ తరువాత కూడా వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. జట్టులో అండీ రస్సెల్ ఒక్కడే 25 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఉమేష్ యాదవ్ 18 పరుగులు చేశాడు. కోల్ కతా 18.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  బెంగుళూరు బౌలర్లలో హసరంగ నాలుగు; ఆకాష్ దీప్ మూడు, హర్షల్ పటేల్ రెండు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు కూడా 17 పరుగులకే మూడు వికెట్లు (డూప్లెసిస్-5; అర్జున్ రావత్-0, విరాట్ కోహ్లీ-12)  కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో డేవిడ్ విల్లె-18, రూథర్ ఫర్డ్-28; షాబాజ్ అహ్మద్-27 పరుగులతో జట్టును ముందుకు నడిపించారు. చివర్లో దినేష్ కార్తీక్(14); హర్షల్ పటేల్(10) లు చురుగ్గా ఆడి  గెలిపించారు. కోల్ కతా బౌలర్లలో టిమ్ సౌతీ మూడు, ఉమేష్ యాదవ్ రెండు, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ పడగొట్టారు.

హసరంగ కు  ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

Also Read : ఐపీఎల్: హైదరాబాద్ పై రాజస్థాన్ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్