Friday, June 12, 2026
Homeస్పోర్ట్స్ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆర్సీబీ సంఘీబావం

ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆర్సీబీ సంఘీబావం

కోవిడ్ పై పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఫ్రంట్ లైన్ వర్కర్లకు సంఘీభావంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఐపీఎల్ మ్యాచ్ లో లైట్ బ్లూ కలర్ జేర్సీలు ధరించనుంది. సెప్టెంబర్ 20న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగే మ్యాచ్ లో ఈ జేర్సీలు వేసుకోనుంది.

కరోనా మహమ్మారిపై విజయం సాధించేందుకు ఫ్రంట్ లైన్ వర్కర్లు చేసిన అనితర సాధ్యమైన కృషికి సంఘీభావంగా, ఈ పోరులో తనువు చాలించిన వారికి నివాళిగా ఈ జేర్సీలు ధరిస్తున్నట్లు ఆర్సీబీ యాజమాన్యం ట్విట్టర్ లో తెలియజేసింది. పిపిఈ కిట్ లైట్ బ్లూ కలర్ లో ఉంటుంది కాబట్టి, అదే రంగులో ఉండేలా లైట్ బ్లూ కాలర్ దుస్తులను ధరిస్తున్నట్లు వెల్లడించింది.

‘గివ్ ఇండియా ఫౌండేషన్’కు తోడ్పాటు అందిస్తూ వంద యూనిట్ల ఆక్సిజన్ కాన్సేన్ట్రేటర్స్ అందించిన సంగతి తెలిసిందే. కోవిడ్ రెండో దశలో ఆక్సిజన్ కోసం అల్లాడుతున్న రోగులను ఆదుకునేందుకు విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఆర్సీబీ తరఫున ఆర్ధిక సహకారం కూడా అందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular