Friday, April 18, 2025
HomeTrending Newsమిర్చి ధర.. ఆల్ టైం రికార్డు

మిర్చి ధర.. ఆల్ టైం రికార్డు

వరంగల్‌లో ‘ఎర్ర బంగారం’ ధర అమాంతం పెరిగింది. రైతులకు చాలా రోజుల తర్వాత లాభాల పంట పండింది. జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఎర్ర బంగారం(మిర్చి) ధరలు రోజు రోజుకి పైపైకి ఎగబాకుతున్నాయి. బుధవారం మార్కెట్‌లో సింగిల్ పట్టి మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాట్‌కు రూ. 41,000 ధర పలికింది. ములుగు మండలం పంచోత్కులపల్లి గ్రామానికి చెందిన మిర్చి రైతు లింగంపల్లి రవీందర్‌ సింగిల్ పట్టి మిర్చి ఎనుమాముల మార్కెట్ కు తీసుకురాగా ఖరీదుదారులు ఈ ధర నిర్ణయించారు. మార్కెట్ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డుగా వ్యాపారులు, మార్కెటింగ్ అధికారులు చెపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్