Saturday, January 18, 2025
Homeసినిమాఓటిటి ప్రసక్తే లేదన్న బన్నీ వాసు

ఓటిటి ప్రసక్తే లేదన్న బన్నీ వాసు

అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు – వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రం గత సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ కావాలి కరోనా కారణంగా ఆగింది. ఈ సంవత్సరం జూన్ 19న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈసారి కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ మళ్లీ వాయిదా పడింది.

అయితే.. ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై ఈ చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే.. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోను థియేటర్లోనే రిలీజ్ చేస్తామని.. ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచనలేదని చెప్పారు. ఇందులో అఖిల్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటించింది. వీరిద్దరి పై చిత్రీకరించిన సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమా అటు అఖిల్ కి, ఇటు బొమ్మరిల్లు భాస్కర్ కి చాలా కీలకం. మరి.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఆశించిన విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్