Thursday, May 30, 2024
Homeసినిమాఅక్టోబర్ 1న విడుదలవుతోన్న ‘రిప‌బ్లిక్‌’

అక్టోబర్ 1న విడుదలవుతోన్న ‘రిప‌బ్లిక్‌’

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌, దేవ్ క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందిన పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ ‘రిప‌బ్లిక్‌’. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ స‌ర్టిఫికేట్‌ను పొందింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. పోస్ట‌ర్ ద్వారా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే… టోపి పెట్టున్న సాయితేజ్ ఇన్‌టెన్స్ లుక్‌తో క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌న‌టువంటి ఓ స‌రికొత్త పాత్ర‌లో సాయితేజ్‌ను చూడ‌బోతున్నార‌ని, నేటి స‌మాజంలో ఉన్న ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతూ అంద‌రిలో ఆలోచ‌న రేకెత్తించేలా సినిమా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్ష‌ణ న‌టులు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, కాలేజ్ సాంగ్‌తో పాటు జోర్ సే.. సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సాయితేజ్ యాక్టింగ్‌, దేవ్ క‌ట్టా మార్క్ టేకింగ్ డైలాగులతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్