Friday, March 29, 2024
HomeTrending Newsకార్డ్ లేకుండా ఏటీఎంలో న‌గ‌దు విత్‌డ్రా

కార్డ్ లేకుండా ఏటీఎంలో న‌గ‌దు విత్‌డ్రా

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్ర‌తిపాద‌న చేసింది. కార్డ్ లేకుండానే అన్ని ఏటీఎంల‌లో న‌గ‌దును విత్‌డ్రా చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించ‌నున్న‌ది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్‌(యూపీఐ) విధానం ద్వారా ఏటీఎంల్లో న‌గ‌దు తీసుకునే ఏర్పాటు చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం కార్డ్‌లెస్ విత్‌డ్రాల‌ను కొన్ని బ్యాంకులు మాత్ర‌మే క‌ల్పిస్తున్నాయ‌ని, అయితే అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్‌వ‌ర్క్స్‌లో కార్డ్‌లెస్ విత్‌డ్రా అవ‌కాశాన్ని క‌ల్పించ‌నున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.

2022-23 సంవ‌త్స‌రానికి సంబంధించిన ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధాన ప్ర‌క‌ట‌నను ఆయ‌న ప్ర‌క‌టించారు. కార్డ్ లెస్ విత్‌డ్రా ద్వారా వినియోగ‌దారుడు త‌న వ‌ద్ద బెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేకున్నా ఏటీఎం నుంచి న‌గ‌దు విత్‌డ్రా  చేసుకునే అవ‌కాశం ఉంటుంది. దీని ద్వారా కార్డ్ స్కిమ్మింగ్‌, కార్డ్ క్లోనింగ్ లాంటి చ‌ర్య‌ల‌ను కూడా అడ్డుకోవ‌చ్చని ఆయ‌న అన్నారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల జారీని ఆపేది లేద‌ని ఆర్బీఐ గ‌ర‌వ్న‌ర్ తెలిపారు. ఆ కార్డుల‌ను కేవ‌లం క్యాష్ విత్‌డ్రాల కోస‌మే కాదని, రెస్టారెంట్లు, షాపులు, విదేశీ టూర్ల స‌మ‌యంలో వాడుకునే వీలుంద‌న్నారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల‌ను ఎప్ప‌టికీ కంటిన్యూ చేస్తామ‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్