Thursday, February 27, 2025
HomeTrending NewsBotsa Satyanarayana: అలా మాట్లాడకూడదు: బొత్స

Botsa Satyanarayana: అలా మాట్లాడకూడదు: బొత్స

తెలంగాణపై, ఆ రాష్ట్ర మంత్రులపై రాష్ట్ర మంత్రి డా. సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. సీదిరి అప్పలరాజు ఏం మాట్లాడారనేది తాను వినలేదని, ఒకవేళ మీడియాలో వచ్చినట్లు ఆయన మాట్లాడి ఉంటే అది కచ్చితంగా తప్పేనని స్పష్టం చేశారు. బాధ్యత గల వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలని, ఇదే విషయాన్ని తాను నిన్న కూడా చెప్పానని బొత్స గుర్తు చేశారు. తెలంగాణ మంత్రులు మాట్లాడిన మాటలపై నిన్న తానూ అభ్యంతరం వ్యక్తం చేశానని, అయితే మనం ఏది మాట్లాడినా సంయమనంతో ఉండాలన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతామని, సీదిరి వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని తేల్చి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్