వీసా అవకతవకలు వెలుగుచూడటంతో భారత్‌లోని ఐదు రాష్ట్రాల నుంచి విద్యార్ధులను ఆస్ట్రేలియా యూనివర్సిటీలు ఇప్పటికే నిషేధించగా తాజాగా మరో రెండు యూనివర్సిటీలు ఈ జాబితాలో చేరాయి. విక్టోరియాకు చెందిన ఫెడరేషన్ యూనివర్సిటీ, న్యూ సౌత్‌వేల్స్‌లోని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ భారత విద్యార్ధులను బ్యాన్ చేశాయి. వీసా అక్రమాల నేపధ్యంలో పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, యూపీతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్ నుంచి విద్యార్ధులకు ప్రవేశాలు కల్పించరాదని ఆస్ట్రేలియా యూనివర్సిటీలు నిర్ణయించాయి.
ఇది తాత్కాలికంగా తలెత్తిన అంశంగా తొలుత తాము భావించినా ఈ ట్రెండ్ కొనసాగుతున్నదని వెల్లడైందని ఆ లేఖలో వర్సిటీ ఆందోళన వ్యక్తం చేసింది. గత నెలలో విక్టోరియా యూనివర్సిటీ, ఎడిత్ కొవన్ యూనివర్సిటీ, టొరెన్స్ యూనివర్సిటీ, సదరన్ క్రాస్ యూనివర్సిటీ వంటి పలు ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు వీసా అక్రమాలు వెలుగుచూడటంతో ఆయా రాష్ట్రాల విద్యార్ధులను బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.