Sunday, January 19, 2025
HomeTrending Newsకర్ణాటకలో కెసిఆర్ కుట్రలు -రేవంత్ రెడ్డి

కర్ణాటకలో కెసిఆర్ కుట్రలు -రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఉపన్యాసాలు చూస్తుంటే మోదీతో వైరం ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తున్న‌ట్లు కనిపిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు మోదీని ఓడించాలని ఉంటే గుజరాత్ లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభపైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించి దుమ్మెత్తి పోశారు. యూపీలో అఖిలేష్ ను గెలిపించాలని ఎందుకు ప్రచారం చేయలేదని.. ఢిల్లీలో తన వ్యాపార భాగస్వామి కేజ్రీవాల్ పార్టీ గెలుపు కోసం ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్ర‌శ్నించారు. మోదీని రక్షించడానికి కాంగ్రెస్ ను దూశిస్తున్నది నిజం కాదా కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూటిగా అడిగారు. 65 మంది ప్రధానులు కలిసి 50 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. ఎనిమిదేళ్లలో మోడీ100 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. అలాంటి మోదీతో కాంగ్రెస్ ను పోల్చడం కేసీఆర్ దుర్మార్గానికి పరాకాష్ట. చైనా మెడలు వంచింది కాంగ్రెస్ అయితే… 2వేల చదరపు కి.మీ. మన దేశాన్ని అక్రమించుకున్నా చైనాకు మోడీ క్లీన్ చిట్ ఇచ్చాడన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ 130 సీట్లు గెలుస్తుందని నివేదికలు చెబుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నేతను లొంగ దీసుకోవడానికి 500 కోట్లు ఆఫర్ ఇచ్చింది నిజం కాదా? కర్ణాటకలో 25 నుంచి 30 సీట్లు ఓడించడానికి ఆయనతో బేర సారాలు చేసింది నిజం కాదా? కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్ కు నోప్పేంటి అన్నారు. ఇక్కడికి సంబంధించిన ఇంటలిజెన్స్ అధికారులను కర్ణాటక రాష్ట్రంలో నియమించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ సుపారీ తీసుకున్నారని ఆరోపించారు.

కెసిఆర్ నిజ స్వరూపం తెలిసే కుమారస్వామి సభకు హాజరు కాలేదన్నారు. కేసీఆర్ అరాచకాలకు కాలం తప్పక సమాధానం చెబుతుంది. కేసీఆర్ వ్యవహార శైలి అన్ని అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ పై కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ వ్యూహాత్మకంగానే డిసెంబర్ లో జరపాల్సిన శీతాకాల సమావేశాలు జరపలేదు. ఫిబ్రవరి చివరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్