Monday, February 24, 2025
HomeTrending Newsపల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై 18 వ తేదీన కెసిఆర్ సమీక్ష

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై 18 వ తేదీన కెసిఆర్ సమీక్ష

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై ఈనెల 18 వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే..పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం జరుగనున్నది. ఈ సమీక్షా సమావేశంలో.. రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, లోకల్ బాడీ కలెక్టర్లు, అన్ని జిల్లాల డిపీవోలు, అటవీశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు,మున్సిపల్ కార్పోరేషన్ల మేయర్లు, కమిషనర్లు తదితర సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్