Sunday, January 19, 2025
Homeజాతీయంఆజాద్ పద్మ అవార్డుపై కాంగ్రెస్ లో రగడ

ఆజాద్ పద్మ అవార్డుపై కాంగ్రెస్ లో రగడ

rift within congress: గులాం నబీ ఆజాద్ కు పద్మ భూషణ్ అవార్డుపై కాంగ్రెస్ లో అంతర్గత రగడ కొనసాగుతోంది.  నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో జమ్మూ కాశ్మీర్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కు పద్మ భూషణ్ దక్కిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న నీనియర్ నేతల జీ-23 బృందం ఈ అవార్డుపై హర్షం వ్యక్తం చేశారు. గులాం నబీ ఆజాద్ దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ఈ పురస్కారం దక్కిందని, అన్ని విధాలా అయన ఈ గౌరవానికి అర్హుడే అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇది బిజెపి పార్టీ తరఫున ఇచ్చిన అవార్డు కాదని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు.

మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్, గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ముద్ర పడిన జైరాం రమేష్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఆజాద్ ఈ అవార్డును అంగీకరించడంపై అన్న పరోక్షంగా విమర్శలు చేశారు. కమ్యునిస్ట్ కురు వృద్ధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య పద్మ భూషణ్ అవార్డును తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ‘అయన (బుద్ధ దేవ్) ఆజాదీ గా ఉండాలనుకుంటున్నారు, గులామ్ గా కాదు’ అంటూ గులాం నబీని పరోక్షంగా దెప్పిపొడిచారు.

ఈ ట్వీట్ కాంగ్రెస్ జి-23 నాయకులను అసంతృప్తికి గురి చేసింది. ఈ త్వీట్ తమను ఆశ్చర్యానికి గురి చేసిందని ఓ నేత వెల్లడించారు. గులాం నబీ నాటి ఇందిరా గాంధీ మంత్రివర్గం నుంచి కొనసాగుతున్నారని, దేశంలోనే ఎక్కువ కాలం కేంద్ర మంత్రివర్గంలో పని చేసిన నేతగా అయన గుర్తింపు పొందారని, ఆయనకు పురస్కారం దక్కితే దాన్ని అగౌరవ పరిచేలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వాపోయారు. కపిల్ సిబ్బల్, ఆనంద్ శర్మ, శశి థరూర్ లు ఆజాద్ కు ఈ పురస్కారం దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అరుదైన నేతగా  అయన చేసిన సేవలు అమూల్యమైనవని ప్రశంసించారు. అయితే తనకు అవార్డు దక్కడంపై గులాం నబీ ఇంకా ప్రతిస్పందించలేదు.

Also Read :బిపిన్ రావత్, కళ్యాణ్ సింగ్ లకు పద్మ విభూషణ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్