Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Ind-SA T20: మూడో మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలుపు

Ind-SA T20: మూడో మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలుపు

ఇండియాతో జరిగిన మూడో  టి 20 లో  సౌతాఫ్రికా 49 పరుగులతో విజయం సాధించింది.  సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ రుస్సో  48 బంతుల్లో  7 ఫోర్లు, 8 సిక్సర్లతో  100 (నాటౌట్) ;  ఓపెనర్ డికాక్ 43 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో  68; చివర్లో డేవిడ్  మిల్లర్ 5 బంతుల్లో 3 సిక్సర్లతో అజేయమైన  19 పరుగులతో రాణించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20  ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.  ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, ఆర్ష దీప్ సింగ్ లకు విశ్రాంతి ఇచ్చి వారి స్థానంలో సిరాజ్, ఉమేష్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ లను జట్టులోకి తీసుకున్నారు.

సౌతాఫ్రికా 30 పరుగుల వద్ద తొలి వికెట్ ( కెప్టెన్ బావుమా -3) కోల్పోయింది.  రెండో వికెట్ కు  డికాక్ – రుస్సో లు 90….. మూడో వికెట్ కు రుస్సో- స్టబ్స్ లు 87 పరుగులు జోడించారు.  ఇండియా బౌలర్లలో చాహర్, సిరాజ్ లు చెరో వికెట్ సాధించారు.

భారీలక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాలో పరుగుల ఖాతా తెరవక ముందే కెప్టెన్ రోహిత్ డకౌట్ అయ్యాడు. జట్టులో దినేష్ కార్తీక్-46;  దీపక్ చాహర్-31; రిశభ్ పంత్27-;  ఉమేష్ యాదవ్ -20 పరుగులతో  మాత్రమే రాణించారు. 18.3 ఓవర్లలో 178  పరుగులకు ఇండియా ఆలౌట్ అయ్యింది.

రుస్సో కు  ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’;   సూర్య కుమార్ యాదవ్  కు ప్లేయర్ అఫ్ ద సిరీస్ దక్కింది.

Also Read : Cricket T20: రికార్డులకు చేరువలో కోహ్లీ, రోహిత్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్