Saturday, November 23, 2024
HomeTrending Newsఒలింపిక్స్ వేడుకల వేళ... పారిస్ లో విధ్వంసం

ఒలింపిక్స్ వేడుకల వేళ… పారిస్ లో విధ్వంసం

ఒలింపిక్స్ వేడుకలకు సిద్దమైన పారీస్ లో అల్లరి మూకలు చెలరేగాయి. ఇవాళ(శుక్రవారం) ఫ్రెంచ్ రైల్వే కంపెనీపై అటాక్ జ‌రిగింది. రైల్వే కంపెనీ ఎస్ఎన్‌సీఎఫ్‌కు చెందిన నెట్వ‌ర్క్ వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేశారు. రైల్వే సామాగ్రికి నిప్పు పెట్టారు. దీంతో లైనింగ్ వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలాయి. ప‌లు చోట్లు రైల్వే లైన్ల‌ను ధ్వంసం చేశారు.

మ‌రికొన్ని గంట‌ల్లో పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్స‌వ వేడుక‌లు ప్రారంభంకానున్న నేప‌థ్యంలో ఈ దాడులు జరగటం ఖచ్చితంగా కుత్రపురితమని నిఘావర్గాలు భావిస్తున్నాయి. పారిస్‌కు ప‌శ్చిమంలో అనేక హై స్పీడ్ టీజీవీ లైన్లు ప్ర‌భావానికి లోన‌య్యాయి. సుందర నగరంలోని స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికుల క్యూ లైన్లు చాంతాడంత ఉన్నాయి. అనేక రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. అట్లాంటిక్‌, నార్త‌ర్న్‌, ఈస్ట్ర‌న్ హై స్పీడ్ లైన్ల‌ను ధ్వంసం చేసిన‌ట్లు ఎస్ఎన్‌సీఎఫ్ పేర్కొన్న‌ది.

రైల్వే వ్య‌వ‌స్థపై అటాక్ వ‌ల్ల సుమారు 8 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక‌వేళ రైళ్లు క‌దిలినా.. ప్ర‌యాణ స‌మ‌యం పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచనా. ప్రపంచ దేశాల పర్యాటకులు, క్రీడాభిమానులు పారీస్ లో జరుగుతున్న హంగామా చూసి హడలిపోయారు.

గత ఏడాది జూన్ 27న పారిస్ శివారు ప్రాంతమైన నాన్‌టెర్రేలో ఇద్దరు పోలీసు అధికారులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నహెల్ మెర్జౌక్‌ను కాల్చి చంపిన తర్వాత ఫ్రాన్స్‌లో వరుస అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఈ ఆలర్లు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఆఫ్రికా, పశ్చిమాసియా ప్రాంతాల నుంచి శరణార్ధులుగా వచ్చిన వారు ఈ దురాగతాలకు పాల్పడ్డారని విచారణలో తేలింది.

తాజాగా జరిగిన అల్లర్లకు.. గతంలో వాటికి సంబంధం ఉందా అనే కోణంలో ఫ్రెంచ్ నిఘా వర్గాలు విచారణ జరుపుతున్నాయి. వివిధ దేశాల్లో అంతర్యుద్దం జరిగినపుడు మానవతా దృక్పథంతో ఆశ్రయం ఇచ్చిన దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. శరణార్ధులుగా వచ్చిన వారు కాల క్రమంలో మెజారిటీగా మారి హక్కుల కోసం డిమాండ్ చేయటం… కొన్ని సందర్భాల్లో హింసకు పాల్పడటం యూరోప్ దేశాల్లో సాధారణమైంది. ముఖ్యంగా ముస్లిం దేశాల నుంచి వచ్చిన వారు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆయా దేశాల ప్రభుత్వాలు పేర్కొన్నాయి.

ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో అలజడి సృష్టిస్తే అంతర్జాతీయంగా సంచలనం అవుతుందని అసాంఘీక శక్తులు కుట్ర చేశాయని ఫ్రెంచ్ ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. 2023 అల్లర్లు జరిగి జూన్ నెలకు ఏడాది పూర్తి అయింది. ఆనాటి అల్లర్లకు గుర్తుగా మళ్ళీ విధ్వంసానికి పాల్పడ్డారా… ఒలంపిక్స్ సంబరాలకు ఆటంకం కపించేందుకు ఇప్పుడు హింసకు దిగారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. శరణార్థి శిభిరాలకు చెందిన వారే ఈ దురాగతానికి ఒడిగట్టి ఉంటారని ఫ్రెంచ్ ప్రజలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు.

– దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్