Monday, February 24, 2025
Homeసినిమా'పెళ్లి చూపులు' బ్యూటీకి హిట్ పడాల్సిందే! 

‘పెళ్లి చూపులు’ బ్యూటీకి హిట్ పడాల్సిందే! 

తెలుగులో కొంతమంది కథానాయికలు తమ స్వభావానికి తగిన పాత్రలను మాత్రమే చేస్తుంటారు. తెరపై పద్ధతికి పట్టుచీర కట్టినట్టుగా కనిపిస్తూ, పాత్రలలో చాలా సహజంగా ఒదిగిపోతూ ఉంటారు. స్కిన్ షో జోలికి వెళ్లకుండా నటనకి అవకాశం ఉన్న పాత్రలతో మాత్రమే ముందుకు వెళుతుంటారు. అలాంటి హీరోయిన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి బలమైన మద్దతు లభిస్తూ వచ్చింది. అలా ఆకట్టుకున్న నాయికలలో సౌందర్య .. స్నేహ .. సాయిపల్లవి వంటివారు కనిపిస్తారు. అదే దారిలో వెళుతున్న మరో కథానాయికగా రీతూ వర్మ కనిపిస్తుంది.

2013లో ఎన్టీఆర్ ‘బాద్ షా’ సినిమా ద్వారా రీతూ పరిచయమైంది. ఆ తరువాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో కథానాయికగా కనిపించింది. ఆ తరువాత ‘ఎవడే సుబ్రమణ్యం’ .. ‘పెళ్లి చూపులు’ వంటి రెండు హిట్లు వెంటవెంటనే పడ్డాయి. అమ్మాయి చాలా సింపుల్ గా కనిపిస్తూ అంతే సహజంగా చేస్తుందనే ప్రశంసలు దక్కాయి. ఆ తరువాత ఆమె కోలీవుడ్ పై కూడా దృష్టి పెట్టి అక్కడ కూడా ఇదే విధమైన క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈ మధ్యనే ‘టక్ జగదీశ్’ .. ‘వరుడు కావలెను’ సినిమాలతో ఆమెను రెండు ఫ్లాపులు పలకరించాయి.

చాలా తక్కువ కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే రీతూ లాంటివారికి ఆ సినిమాలు కాస్తా పోతే బాధ ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె ‘ఒకే ఒక జీవితం‘ సినిమాలో చేసింది. శర్వానంద్ జోడీగా ఆమె చేసిన ఈ సినిమా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి నుంచి కూడా ఈ సినిమా టీమ్ అంచనాలు పెంచకుండా, రిలీజ్ తరువాత మౌత్ టాక్ తోనే జనాలను థియేటర్లకు రప్పించాలనే ఉద్దేశంతో ఉంది. శర్వానంద్ కి మాత్రమే కాదు .. రీతూకి కూడా ఈ సినిమా హిట్ అత్యవసరమే అని చెప్పాలి.

Also Read : వెన్నెల కిశోర్ కి వార్నింగ్ ఇచ్చిన శర్వానంద్!  

RELATED ARTICLES

Most Popular

న్యూస్