Saturday, April 5, 2025
Homeస్పోర్ట్స్WBBL: మెల్ బోర్న్ స్టార్స్ కు జమీయా రోడ్రిగ్యూస్

WBBL: మెల్ బోర్న్ స్టార్స్ కు జమీయా రోడ్రిగ్యూస్

భారత మహిళా క్రికెట్ జట్టు ప్లేర్ జమీయా రోడ్రిగ్యూస్ విమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో మెల్ బోర్న్ స్టార్స్ జట్టుకు ఆడనునుంది. ఆ జట్టు యాజమాన్యం మెల్ బోర్న్ రెనెగేడ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.  గత సీజన్ లో 116 స్ట్రయిక్ రేట్, 333 పరుగులతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఇటీవలి కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా రాణించింది. 2018లో 17 ఏళ్ళ వయసులో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టుకు తొలిసారి ఆడింది. అప్పటినుంచి 58టి 20లు, 21వన్డేలు ఆడింది. రెండు ఐసిసి టి 20వరల్డ్ కప్ లు, 2020 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఆడింది.

త్వరగా మెల్ బోర్న్ వెళ్లి జట్టుతో చేరాలని ఆనుకుంటున్నట్లు, బిగ్ బాష్ లీగ్ ఆడడం, అందునా మెల్ బోర్న్ స్టార్ జట్టు సభ్యురాలిగా ఆడుతున్నందుకు  సంతోషంగా ఉందని రోడ్రిగ్యూస్ చెప్పింది. ఈ లీగ్ ఆడుతున్న తొలి భారత మహిళా క్రికెటర్ అయినందుకు  గర్వంగా ఉందని తెలిపింది. అందులోనూ మెల్ బోర్న్ తనకు ఇష్టమైన నగరమని ఎప్పుడెప్పుడు అక్కడకు వెళ్ళాలా అని ఉత్సుకతగా ఉందని చెప్పింది.

అయితే అక్టోబర్ 1 నుంచి 16వరకూ బంగ్లాదేశ్ లో  ఆసియా కప్ మహిళా క్రికెట్-2022  జరగనుంది. బిగ్ బాష్ లీగ్  అక్టోబర్ 13 నుంచి మొదలు కానుంది. ఆసియా కప్ ముగిసిన వెంటనే రోడ్రిగ్యూస్ మెల్బోర్న్ వెళ్లనుంది.

Also Read : WBBL: మెల్ బోర్న్ స్టార్స్ కు జమీయా రోడ్రిగ్యూస్

RELATED ARTICLES

Most Popular

న్యూస్