Saturday, February 22, 2025
Homeస్పోర్ట్స్రోహిత్ శర్మకే సారధ్యం

రోహిత్ శర్మకే సారధ్యం

Rohith Sharma To Lead The T20 Team :

విరాట్ కోహ్లీ స్థానంలో టీమిండియా టి.20 జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మను బిసిసిఐ నియమించింది. ఈ నెల 17 నుంచి న్యూ జిలాండ్ తో జరగనున్న మూడు మ్యాచ్ ల టి.20 సిరీస్ కు రోహిత్ సారధ్యంలోనే జట్టు బరిలోకి దిగనుంది.  రోహిత్ శర్మకు డిప్యూటీగా కెఎల్ రాహుల్ ను ఎంపిక చేసింది.

ప్రస్తుత జట్టులో విరాట్ కోహ్లీ, జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి కల్పించారు. కొంత కాలంగా విఫలమవుతోన్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను తప్పించారు. రుతురాజ్ గైక్వాడ్, హర్షాల్ పటేల్, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్ లకు జట్టులో చోటు కల్పించారు.

జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్) రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర పటేల్, ఆవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షాల్ పటేల్, మహమ్మద్ సిరాజ్

టీమిడియా న్యూ జిలాండ్ తో మూడు వన్డేలతో పాటు రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. 17న జైపూర్, 19న రాంచీ, 21న కోల్ కతాల్లో టి 20 మ్యాచ్ లు జరగనున్నాయి. నవంబర్ 25-29 వరకూ మొదటి టెస్ట్ కాన్పూర్ లోను, డిసెంబర్ 3-7వరకూ రెండో టెస్ట్ ముంబై లోను జరగనున్నాయి.

Also Read : రవి శాస్త్రి స్థానంలో ద్రావిడ్ నియామకం

RELATED ARTICLES

Most Popular

న్యూస్