రిషికొండ నిర్మాణాలపై హైకోర్టు సూచనలు మేరకే ముందుకు వెళ్తున్నామని నిర్మాణాలను ఆపాలని హైకోర్టు ఎక్కడ చెప్పలేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు హైకోర్టు సూచనలు మేరకే ముందుకు వెళ్తున్నామని, నిర్మాణాలను ఆపాలని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా నిన్న తాను ఇచ్చిన వివరణను ప్రస్తావించకుండా కేవలం ఒక చిన్న ట్వీట్ ను పట్టుకొని రాజకీయం చేశారని ఈనాడు దినపత్రికపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తాను చెప్పిన విషయాలను పక్కదారి పట్టించేందుకు దీనికి ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు.
రిషికొండపై మొత్తం 69 ఎకరాలు పర్యాటక శాఖ భూమి ఉందని దానిలో 9.18 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఉన్నాయని, ప్రస్తుతం తాము నిర్మిస్తున్న భవనాలు 2.18 ఎకరాల్లో మాత్రమేనని వివరించారు అక్కడ ఏడు భవనాలకు పర్మిషన్ ఉంటే ప్రస్తుతం నిర్మిస్తున్నది కేవలం నాలుగు భవనాలు మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రభుత భవనాలు పాతవైపోతే వాటి స్థానంలో కొత్తగా నిర్మాణాలు చేపడితే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి నివాస స్థలం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటే సేఫ్టీ అనేది ఓ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని, దానిపై మాట్లాడే హక్కు వీరికి ఎక్కడిదని అన్నారు. పవన్ రిషికొండకు వచ్చి హంగామా చేసి ఏదో మాట్లాడితే దానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన కొన్ని పత్రికలు… తాను ఆ శాఖ మంత్రిగా అధికారికంగా ఇచ్చిన వివరణ మాత్రం ప్రచురించకపోవడం శోచనీయమన్నారు.
రిషికొండ నిర్మాణాలపై కోర్టులో సమర్పించామని, కోర్ట్ నియమించిన జాయింట్ కమిటీ వచ్చి నిర్మాణాలను పరిశీలించి ఓ నివేదిక ఇచ్చిందని వివరించారు. కోర్టు సూచించిన మార్పులు చేర్పులు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. విశాఖపై విపక్షాలు కొన్ని మీడియా సంస్థలు ఎందుకు విషం కక్కుతున్నాయో అర్థం కావటం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు