హైదరాబాద్ జిహెచ్ఎంసి నూతన కమిషనర్ గా రోనాల్డ్ రోస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిహెచ్ఎంసి కమిషనర్ గా పని చేసిన లోకేష్ కుమార్ నుండి రోనాల్డ్ రోస్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఫైనాన్స్ సెక్రటరీగా పని చేసిన రోనాల్డ్ రోస్ జిహెచ్ఎంసి కమిషనర్ ప్రభుత్వం నియమించింది.
ఇక్కడ జిహెచ్ఎంసి కమిషనర్ గా పని చేసిన లోకేష్ కుమార్ ను కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు రాష్ట్ర ఎన్నికల అడిషనల్ సిఇఓ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
నూతన కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన తదనంతరం రోనాల్డ్ రోస్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రోనాల్డ్ రాస్ ను, బదిలీ పై వెళుతున్న లోకేష్ కుమార్ ను ఆయా విభాగాల హెచ్ ఓ డి లు, జోనల్, డిప్యూటీ కమిషనర్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రోనాల్డ్ రోస్ గతంలో మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా, ఫైనాన్స్ సెక్రెటరీ, గురుకుల పాఠశాల సెక్రటరీ గా జిహెచ్ఎంసి లో అదనపు కమిషనర్, జోనల్ కమిషనర్ గా పని చేశారు.
ఈ సందర్భంగా ఈ.వి.డి.ఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ఇ.ఎన్.సి జియా ఉద్దీన్, అడిషనల్ కమిషనర్లు ప్రియాంక అలా, వి.కృష్ణ, సరోజ, విజయలక్ష్మి, జయరాజ్ కెనడి, HRDCL సి ఇ సరోజినీ దేవి, ప్రాజెక్టు సి ఇ దేవానంద్, సి సి పి దేవేందర్ రెడ్డి, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర రెడ్డి, అడిషనల్ సి పి శ్రీనివాస్, హౌసింగ్ ఓ ఎస్ డి సురేష్ కుమార్, సి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పద్మజా, సి పి ఆర్ ఓ మహమ్మద్ ముర్తుజా, సెక్రటరీ లక్ష్మి, పీడి సౌజన్య, జాయింట్ కమిషనర్ శశి రేఖ వెంకట్ రెడ్డి, సంధ్య, ఎస్ ఈ లు వెంకటరమణ, విద్యాసాగర్, రవీందర్ రాజు, రత్నాకర్, అశోక్ రెడ్డి, చిన్న రెడ్డి, శంకర్ పి.ఆర్.ఓ పద్మ తదితరులు పాల్గొన్నారు.