Sunday, January 19, 2025
Homeసినిమాహ్యాపీ బర్త్ డే టు రోషన్

హ్యాపీ బర్త్ డే టు రోషన్

రోషన్ మేకా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యువ నటుడు. అతను నటుడు శ్రీకాంత్ మరియు నటి ఊహాల కుమారుడు. మొదట బాలనటుడిగా రుద్రమదేవి (2015) చిత్రంలో తెర పై కనిపించాడు. ఆతర్వాత రోషన్ ప్రధాన పాత్రలో తొలిసారిగా నటించిన చిత్రం నిర్మలా కాన్వెంట్ (2016) ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా SIIMA అవార్డును గెలుచుకున్నారు. ఈ మూవీ తర్వాత కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘పెళ్లి సందడిలో’ కథానాయకుడిగా నటించాడు. అందర్నీ ఆకట్టుకుని కమర్షియల్ సక్సెస్ సాధించాడు.

రోషన్ ఇప్పటికే తన లుక్స్, ఆన్-స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీతో తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పెళ్లి సందడి విజయం తర్వాత, రోషన్ కొత్త సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ యువ హీరో ఇప్పుడు వైజయంతీ మూవీస్ మరియు వేదాంస్ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌లో తన తదుపరి సినిమాతో రాబోతున్నాడు. తన తదుపరి సినిమాలు ప్రఖ్యాత నిర్మాణ సంస్థలలో రాబోతున్నాయి అని యువ నటుడు రోషన్ చాలా ఉత్సాహంగా వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్