ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన జగిత్యాల బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైన కేసీఆర్ ప్రసంగం ప్రజలను ఆకట్టుకోలేక పోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం 27 నిమిషాల పాటు కేసీఆర్ ప్రసంగించిగా… ఉద్యమ కాలంనాటి అంశాలు ఆసక్తి రేకేత్తించలేకపోయిందని పలువురు అభిప్రాయాపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సీఎం టూర్ ఖరారు కాగా మోతే రోడ్డులో నిర్వహించే సభను విజయవంతం చేయడానికి వారం రోజులపాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కష్టపడ్డప్పటికి సభ సక్సెస్ కు కృషిచేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేరుసీఎం కేసీఆర్ తన ప్రసంగంలో పేరు తీయకపోవడం కార్యకర్తలు, ప్రజల్లో ఆసక్తికర చర్చకు తెరలేపినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బుధవారం సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని జగిత్యాల సమీపంలోని మోతే లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, అర్ముర్, బాల్కొండ తదితర నియోజకవర్గాలనుండి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైనప్పటికీ ప్రజలు కేసీఆర్ నుండి కొత్త ధనం ప్రసంగాన్ని ఆశించగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోదీలను టార్గెట్ చేసి ప్రసంగించడం మినహా సబికులను ఆకట్టుకోలేకపోయింది.
కొండగట్టుకు 100 కోట్ల నిధులు మంజూరు చేసి దేశం అబ్బురుపడే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పగా సభలో ఉన్న కొందరు కొండగట్టు బస్సు ప్రమాద మృతులను ఆదుకోవాలన్నారు. బస్సు ప్రమాదంలో 64 మంది మృతి చెందితే సీఎం పరామర్శకు రాలేదని ఏళ్ళు గడిచిన వారికి ప్రభుత్వం సాయం అందించలేదని గోనుక్కున్నరు. బండలింగాపూర్ ను మండలంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అదనంగా 10 కోట్ల నిధులు ఇస్తామని చెప్పడం మినహా కొత్తగా జగిత్యాల జిల్లాకు వరాలు ప్రకటించలేకపోయారు.
సీఎం సభ లో ఆపశృతి
సీఎం సభ బందోబస్తుకు వచ్చిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ పర్శరాము గుండెపోటుతో మరణించడంతో అప్పశృతి చోటుచేసుకుంది. అలాగే జగిత్యాల అంగడి బజారు లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహనికి అడ్డుగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేరుతో కట్టిన ఫ్లెక్సీని తొలగించాలని పద్మశాలి సంఘం నాయకులు చెప్పిన తీయకపోవడంతో ఓ యువకుడు ఫ్లెక్సీకి పెట్రోల్ పోసి తగులబెట్టిన సంఘటన టిఆర్ఎస్ శ్రేణులకు భాధ కలిగించింది. ప్రయివేటు స్కూల్ బస్సులతో బహిరంగ సభకు ప్రజలను తరలించడానికి ఉపయోగించి ట్రాఫిక్ కు ఇబ్బందులు ఏర్పడుతాయని స్కూల్లకు సెలవు ప్రకటించడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేసీఆర్ బహిరంగసభకు టీఆరెఎస్ నాయకులు ఆశించిన మేర జనం వచ్చారు. అయితే సభనుంచి ఇంటికీ వెళ్లేటప్పుడు మాకూ 200 రూపాయలు యిస్తానని చెప్పి తీసుకువచ్చిన వారు ఇవ్వకుండా కనబడకుండా పోయారని మహిళలు శాపనార్తాలు పెట్టారు.వారి అవసరం తిరిపోయిందని మళ్ళీ ఏ మొఖం పెట్టుకుని ఓట్ల కోసం వస్తారో చూస్తామని మహిళలు తిట్టుకొనడం కొసమెరుపు.
అలాగే సభస్థలికి కిలోమీటర్ దూరంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయడంతో మహిళలు ఇబ్బంది పడ్డారు.
తాగు నీటి వసతి కల్పించకపోవటం, సభలో టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో చిన్నారులు మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. సీఎం బహిరంగ సభకు జనాన్ని తరలించడానికి ఆర్టీసీ బస్సులను తీసుకోవడం మూలంగా వివిధ రుట్లలో ప్రయాణించే ప్రయాణికులు గంటల తరబడి వేచిచుసిన బస్సులు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆరోపించారు.
టిడిపి నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడంతో పోలీసులు, టిడిపి నాయకుల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది.