Saturday, January 18, 2025
Homeసినిమా2022 టాప్ 10 లిస్ట్ ఇదే

2022 టాప్ 10 లిస్ట్ ఇదే

కాలం చాలా వేగంగా కదులుతుంది. అప్పుడే 2022 ముగిసిపోతోంది. ఈ ఏడాది ఎన్నో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఇయర్ ఎండింగ్ లోకి రావడంతో ఐఎండిబి సంస్థ టాప్ 10 పాపులర్ సినిమాల లిస్ట్ ని ప్రకటించింది. ఈ లిస్ట్ లో అందరూ ఊహించినట్టుగా టాప్ 1 స్థానాన్ని ఆర్ఆర్ఆర్ సినిమా దక్కించుకుంది. 2022లో మోస్ట్ పాపుల‌ర్ మూవీగా ఐఎండిబి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని క‌ట్ట‌బెట్టింది. ఇక 2వ స్థానంలో క‌శ్మీర్ ఫైల్స్‌ చిత్రం నిలిచింది. టాప్ 3 లిస్టులో కేజీఎఫ్ 2 నిలిచింది. 4, 5, 6 స్థానాల్లో కమల్ హాసన్ విక్ర‌మ్‌, రిషబ్ శెట్టి కాంతారా, మాధవన్ ది నంబి ఎఫెక్ట్ చిత్రాలు నిలిచాయి.

7వ స్థానంలో మేజర్, 8వ స్థానంలో సీతారామం నిలిచాయి. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్, చార్లి 777 చివరి రెండు స్థానాల్ని కైవసం చేసుకున్నాయి. ఈ టాప్ 10 చిత్రాలు కమర్షియల్ గానూ పెద్ద విజయం సాధించడం విశేషం. అయితే… యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు మ‌రో రెండు తెలుగు చిత్రాల‌కు ఈ లిస్టులో చోటు ద‌క్కించుకున్నాయి. టాప్ 10 సినిమాల్లో 9 సౌత్ ఇండియ‌న్ సినిమాలే ఉండడం విశేషం.

అయితే.. క‌శ్మీర్ ఫైల్స్ ఒకటే బాలీవుడ్ మూవీ. ఇది బాలీవుడ్ సినిమానే అయినప్పటికీ.. తీసింది మాత్రం తెలుగు నిర్మాతే కావడం విశేషం. మొత్తానికి 2022లో సౌత్ సినిమాలు సత్తా చాటాయి. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాలు బాలీవుడ్ నే కాదు హాలీవుడ్ ని సైతం షేక్ చేశాయి. ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పుడు ఆస్కార్ బరిలో ఉంది. అలాగే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ ముత్తు రికార్డ్ ను క్రాస్ చేసి చరిత్ర సృష్టించింది. మరి.. 2023లో కూడా తెలుగు సినిమాలు సత్తా చూపిస్తాయని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్