Sunday, January 19, 2025
Homeసినిమాఆర్ఆర్ఆర్ సునామి: 3 రోజుల్లో 500 కోట్లు

ఆర్ఆర్ఆర్ సునామి: 3 రోజుల్లో 500 కోట్లు

RRR-keep on going: ‘బాహుబ‌లి’తో చ‌రిత్ర సృష్టించిన త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన సంచ‌ల‌న‌ చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ.. రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్స్ వ‌స్తుండ‌డం విశేషం.

ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లోనూ అలాగే నార్త్ లోనూ రోజురోజుకు క‌లెక్ష‌న్స్ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల‌కు 140 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఇక నార్త్ విష‌యానికి వ‌స్తే.. మొద‌టి రోజు 19 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఆత‌ర్వాత రెండో రోజు 24 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఇక మూడ‌వ రోజు 31.50 కోట్లు క‌లెక్ట్ చేసింది. మొత్తంగా బాలీవుడ్ లో మూడు రోజుల‌కు 74.50 క‌లెక్ట్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా మూడు రోజుల‌కు 500 కోట్లు క‌లెక్ట్ చేయ‌డం విశేషం. మ‌రి.. ఫుల్ ర‌న్ లో బాహుబ‌లి 2 రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేస్తుందేమో చూడాలి.

Also Read : ఆర్ఆర్ఆర్.. హైలైట్ ఇదే

RELATED ARTICLES

Most Popular

న్యూస్