Saturday, January 18, 2025
Homeసినిమారేపు (నవంబర్1న) ‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్

రేపు (నవంబర్1న) ‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్

RRR Glimpse Will Be Released On November 1st Monday At 11 Am :

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ జనవరి 7న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మొన్న శుక్రవారం పీవీఆర్ సినిమాస్- ఆర్ఆర్ఆర్ మధ్య వ్యాపార ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ పివీఆర్ సంస్థ తన లోగోను త్రిబుల్ ఆర్ సినిమా పేరు కలిసి వచ్చే విధంగా ‘పీవీఆర్ఆర్ఆర్’ గా మార్చుకుంది. దేశ వ్యాప్తంగా 70కి పైగా నగరాలలో 850 పైబడిన స్క్రీన్లలో ఈ లోగో ప్రదర్శితమవుతుంది.

తాజాగా నేడు ఆర్ఆర్ఆర్ నుంచి సరికొత్త సమాచారం వెలువడింది. రేపు, నవంబర్ 1న ఉదయం 11 గంటలకు 45 సెకన్ల పాటు ఉండే గ్లింప్స్ ను విడుదల చేయనున్నారు.  మొన్న పీవీఆర్ తో ఒప్పందం కుదిరిన రోజే దీన్ని విడుదల చేయాల్సి ఉండగా, అదేరోజు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంతో వాయిదా వేశారు.

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ను డివివి ఎంటర్టైన్మెంట్స్, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న ఈ సినిమాలో ఈ అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌-ఆయన జోడీగా అలియాభట్‌; కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌-జోడీగా హాలీవుడ్‌ నటి ఓలివియా మోరిస్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Must Read :ఎన్టీఆర్ పీఆర్వో, నిర్మాత మ‌హేష్ కోనేరు మృతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్