Sunday, January 19, 2025
Homeసినిమాజ‌పాన్ లో ఆర్ఆర్ఆర్ త్ర‌యం.

జ‌పాన్ లో ఆర్ఆర్ఆర్ త్ర‌యం.

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ‘ఆర్.ఆర్.ఆర్’. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ దేశ‌విదేశాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. 1000 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసి చ‌రిత్ర సృష్టించింది. అయితే.. ఆర్ఆర్ఆర్ మూవీ అక్టోబ‌ర్ 21న జపాన్ లో విడుదల కాబోతోంది. ఇప్పటికే బాహుబలి ప్రాంఛైజీతో జక్కన్న జపాన్ లో సత్తా చాటాడు. మరో వైపు తారక్ – చరణ్ లకు కూడా అక్కడ మంచి క్రేజ్ ఉంది.

మూవీ ప్రమోషన్స్ లో మాస్టర్ మైండ్ అయిన ఎస్ఎస్ రాజమౌళి.. సినిమాని జపాన్ లో దూకుడుగా ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేశారు. రామ్ చరణ్ తన భార్య ఉపాసన తో కలిసి టోక్యోకి వెళ్లారు. ఇప్పుడు ఎన్టీఆర్ తన భార్య ప్రణతి మరియు ఇద్దరు పిల్లలు అభయ్ రామ్ – భార్గవ్ రామ్ లతో కలిసి జ‌పాన్ వెళ్లిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ త్రయం ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజ‌మౌళిలు జపాన్ ప్రమోషన్స్ లో హంగామా చేయనున్నారు.

బాహుబలి క్రేజ్ ని క్యాష్ చేసుకుని ఆర్ఆర్ఆర‌ర్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లడానికి పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. క్రేజ్ అక్కడ మాములుగా లేదనిపిస్తోంది. దీన్ని తదుపరి లెవల్ కి తీసుకెళ్లడానికి ఇప్పుడు తారక్, చరణ్ కూడా వారితో జత కలవనున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ పరిశీలన కోసం పంపిస్తున్న నేపథ్యంలో అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జపాన్ రిలీజ్ అకాడమీ అవార్డుల కొరకు క్యాంపెయిన్ మాదిరిగా ఉపయోగపడుతుంది. జపాన్ లో ఎంత క‌లెక్ట్ చేస్తుందో..?  ఆస్కార్ అవార్డుల్లో ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.

Also Read : ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పంప‌క‌పోవ‌డానికి కార‌ణమిదే 

RELATED ARTICLES

Most Popular

న్యూస్