Saturday, January 18, 2025
Homeసినిమాఇంటర్నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్

ఇంటర్నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్

ఎన్టీఆర్, రామ్ చరణ్‌, రాజమౌళిల కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా ఖచ్చితంగా సంచలన విజయం సాధిస్తుంది అనుకున్నారు సినీజనాలు. అంచనాలకు తగ్గట్టుగానే అద్భుతమైన విజయం సాధించింది. 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ఇక ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ కు చెందిన అనేక మంది ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇటీవల జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజైంది. అక్కడ ఫస్ట్ డే నుంచి రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన ఇండియన్ మూవీగా సరికొత్త రికార్డ్ సాధించే దిశగా పెరిగెడుతుంది. మరో వైపు ఆస్కార్ బరిలో నిలిచింది. ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డ్ రావడం ఖాయం అంటున్నారు. ఇదిలా ఉంటే… ఆర్ఆర్ఆర్ తాజాగా ఓ అవార్డును గెలుచుకుంది. సన్‌ సెట్ సర్కిల్ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఆర్ఆర్ఆర్ మూవీ విజేతగా నిలిచింది.

బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో ఈ చిత్రం రన్నరప్‌ అవార్డును సొంతం చేసుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ శాటర్న్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్స్ పురస్కారాల్లోను ఈ సినిమా సత్తా చాటింది. వివిధ కేటగిరిల్లో అకాడమీ అవార్డు కోసం పోటీపడుతుంది.  మరి.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు అందుకుని చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.

Also Read : జపాన్ లో మరో రికార్డ్ సాధించిన ఆర్ఆర్ఆర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్