Saturday, January 18, 2025
Homeసినిమాఆస్కార్ బ‌రిలో ఆర్ఆర్ఆర్. ఉత్త‌మ న‌టుడిగా ఎన్టీఆర్?

ఆస్కార్ బ‌రిలో ఆర్ఆర్ఆర్. ఉత్త‌మ న‌టుడిగా ఎన్టీఆర్?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కించిన ‘ఆర్ఆర్ఆర్‘ రిలీజైన అన్ని భాష‌ల్లో స‌క్సెస్ సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి చ‌రిత్ర సృష్టించింది. రిలీజైనప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డో చోట‌ ఆర్ఆర్ఆర్ పేరు విన‌బ‌డుతూనే ఉంది.

ఈ సంచ‌ల‌న‌ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషించ‌గా ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ అవార్డుల్లోనూ హ‌వా కొన‌సాగించ‌నుంద‌ని వెరైటీ అనే హాలీవుడ్ మ్యాగ‌జైన్ తెలియ‌చేసింది. మొత్తం నాలుగు కేట‌గిరీలో ఈ చిత్రం పోటీ ప‌డే అవ‌కాశం ఉందంటూ క‌థ‌నాలు ప్ర‌చురించింది. ప్రతి సంవ‌త్స‌రం ఉత్తమ నటీనటుల జాబితాను ముందే ప్రెడిక్ట్ చేసే వెరైటీ ఎడిషన్ అనే మ్యాగ‌జైన్ వారు ఈసారి కూడా ఆస్కార్ అకాడ‌మీ అవార్డుల నామినేష‌న్‌లో ఎవ‌రెవ‌రు ఏ స్థానంలో ద‌క్కించుకుంటారో చెప్పింది.

2023కు సంవ‌త్స‌రానికి గాను బెస్ట్ యాక్టర్ విభాగంలో ఆసియా నుండి ఎన్టీఆర్ పేరును ఎంపిక చేశారు. అలాగే ఉత్త‌మ చిత్రంగా ఆర్ఆర్ఆర్, ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి, ఉత్త‌మ ఒరిజిన‌ల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఈ చిత్రం నామినేట్ అయ్యే అవ‌కాశం ఉందంటూ జోస్యం చెప్పింది. ప్ర‌స్తుతం ఈ వార్త‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎన్టీఆర్ అభిమానులు అయితే.. చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నారు. మ‌రి.. హాలీవుడ్ మ్యాగ‌జైన్ చెప్పింది నిజ‌మౌతుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్