Pre-Release Event: ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు సినీ అభిమానులు ఎవరి నోట విన్నా ఇదే మాట. భారతదేశంలోనే భారీ బడ్జెట్ మూవీగా రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మార్చి 19న కర్ణాటకలోని చిక్కబల్లాపురలో సాయంత్రం 6 గంటలకు భారీ స్థాయిలో నిర్వహించనున్నారు.
ఈ విషయాన్ని కేవిఎన్ ప్రొడక్షన్ హౌస్ వెల్లడించింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ పాసుల కోసం kvnproductions.co.in లోకి లాగిన్ అవ్వాలని తెలియచేశారు. అయితే.. ఈ వేడుకకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని సమాచారం. అలాగే చిరంజీవి, బాలకృష్ణ కూడా ఈ వేడుకు హాజరు కానున్నారని వార్తలు వస్తున్నాయి కానీ.. మేకర్స్ ఇంకా కన్ ఫర్మ్ చేయాల్సివుంది.