Sunday, January 19, 2025
HomeTrending Newsముస్లీం మేధావులతో మోహన్ భగవత్ సమావేశం

ముస్లీం మేధావులతో మోహన్ భగవత్ సమావేశం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ రోజు చారిత్రాత్మక సమావేశం నిర్వహించింది. ఆర్ ఎస్ ఎస్  చీఫ్ మోహన్ భగవత్ ఈ రోజు ఢిల్లీ కస్తుర్బాగాంది మార్గ్ లోని మసీదులో ముస్లీం మత పెద్దలు, మేదావులతో సమావేశం అయ్యారు. దేశంలో మతపరమైన అపార్థాలు, విభేదాలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు వర్గాల భాగస్వామ్యంతో దేశాభివృద్దికి కృషి చేయాలని మోహన్ భగవత్ ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు. కొంత కాలంగా క్రైస్తవులు, ముస్లీం మత పెద్దలతో ఆర్ ఎస్ ఎస్ నేతలు సమావేశం అవుతున్నారు. దీంతో అపోహలు తొలగిపోతాయని సంఘ్ వర్ఘాలు భావిస్తున్నాయి. జ్ఞానవాపి కేసు, జనాభా నియంత్రణ, కర్ణాటకలో హిజాబ్ వివాదం తదితర అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ గత కొన్ని రోజులుగా మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి, అంతర్గత సంబంధాలను మెరుగుపరచడానికి ముస్లిం మేధావులను కలుస్తున్నార‌ని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. ‘‘ ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ అన్ని వర్గాల ప్రజలను కలుస్తారు. ఇది నిరంతర సాధారణ ‘సంవాద్’ ప్రక్రియలో భాగం ’’ అని ఆయన తెలిపారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రస్తుత “అసమ్మతి వాతావరణం” గురించి ఆందోళన చెందుతున్నారని  మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఎస్ వై  ఖురైషి చెప్పారు. గోవులను చంపడం, కాఫిర్లనడం వంటివి హిందువులను బాధిస్తున్నాయని భగవత్ ముస్లిం నాయకులతో ఈ సందర్భంలో అన్నారు. దానికి ముస్లిం నాయకులు జవాబుగా ముస్లింలు చట్టానికి బద్ధులని తెలిపారు. ముస్లింలు ఇక్కడి వారేనని, వారి డిఎన్ఏ కూడా ఇక్కడిదేనని, ముస్లింలలోని చాలా మంది మతాంతీకరణ పొందినవారేనని తెలిపారు. వారి మధ్య భేటీ కేవలం అరగంట అని మొదట అనుకున్నారు. కానీ అది గంటంపావు వరకు కొనసాగింది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌వై ఖురైషీ, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మాజీ ఛాన్సలర్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా, మాజీ ఎంపీ షాహిద్ సిద్ధిఖీ, వ్యాపారవేత్త సయీద్ షెర్వానీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్