Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

 Kcrs Comments On Constitution Motkupalli :

సీఎం కేసీఆర్ ఎం అన్నారని ప్రతిపక్షాలు బట్టలు చింపుకుంటున్నాయని మాజీ మంత్రి ,టిఆర్ ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. బీజేపీ నేతలైతే ఏదో జరిగినట్టుగా అరుస్తున్నారని, రైతు చట్టాలపై క్షమాపణ చెప్పినప్పుడే ప్రధానిగా ఉండే అర్హత నరేంద్ర మోడీ కోల్పోయారన్నారు. మోడీ ఆ రోజే రాజీనామా చేయాల్సిందని  మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్ లో అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాల హక్కులపై పోరాటం చేసే అవసరం ఎందుకు వచ్చింది. ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు ఈ కేంద్ర ప్రభుత్వమన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎటు పోయింది…రైళ్లు కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయిందో …ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉందా లేదా. జాతీయ స్థాయిలో ఎదుగుతున్న సీఎం కేసీఆర్ ను బిజెపి అణగ తొక్కే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

బిజెపి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నందున ఇవాళ నిధులు అన్ని కూడా బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలకి ఇస్తే పోరాటం చేయడంలో తప్పేంటని మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ ఇస్తే మీరు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. దళిత బంధు ఇస్తున్న సీఎం కేసీఆర్ పై  మీరు విమర్శలు చేస్తుంటే మీరు ఎంత దుర్మార్గపు మనుషుల్లో అర్థం అవుతుందన్నారు. దళితుల మీద మీకు ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా ఎందుకు దళిత బంధు ఇవ్వడం లేదు…ఇచ్చే దమ్ము మీకు ఉందా అన్నారు.

దళితలకు న్యాయం చేసే దమ్ము దైర్యం మీకు ఉందా ..కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకుంటే ఖబడ్ధార్ మిస్టర్ బండి సంజయ్ అని మోత్కుపల్లి వార్నింగ్ ఇచ్చారు. దళిత బందుకు రేపటి బడ్జెట్ లో 20 వేల కోట్లు పెట్టబోతున్నారు సీఎం కేసీఆర్. దళితులను అవమాన పర్చే మీరు దళితలకు న్యాయం ఎక్కడ చేస్తారని విమర్శించారు. కేసీఆర్ ఆదర్శవంతంగా పాలన చేస్తుంటే ఓర్వలేక పోతున్నారని, స్వాతంత్య్రం వచ్చిన 75 యేండ్లు గా మాకు సుఖం లేదన్నారు. అంబేద్కర్ లేకపోతే దళిత జాతి లేదని, ఈ రాజ్యాంగం వద్దనేది బీజేపీ పార్టీ…కరుడుగట్టిన బూర్జువా  పార్టీ ఈ బిజెపి…ఒక్కరోజు కూడా మతం గురించి మాట్లాడని రోజు ఉంటాదా అన్నారు.

దుర్మార్గపు పార్టీ బిజెపి…..ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్  భగవత్ కూడా రాజ్యాంగం లో మార్పులు చేయాలన్నారు. వాజపేయి ప్రభుత్వం రాజ్యాంగ మార్పుకోసం కమిటీ వేసింది ..ఆయన మీ పార్టీ కాదా అన్నారు. బిజెపి హయంలో ఎంతో మంది దేశాన్ని దోచుకున్న దోంగలను బయట దేశానికి పంపిస్తున్నారు…. ఇతర దేశాల్లో ఉన్న నల్ల ధనం తెచ్చి ప్రతి పేదవాడికి ఇస్తా అని మీ మోడీ అన్నాడు ఎంత మందికి ఇచ్చారు మిస్టర్ బండి సంజయ్….సిగ్గు ఉందా సంజయ్… అని ఘాటుగా విమర్శించారు.

105 సార్లు రాజ్యాంగ సవరణ లు చేశారు.  ఆనాడు అంబెడ్కర్ కూడా చెప్పాడు అవసరమైతే రాజ్యాంగమే మార్చుకోవచ్చని, అంబేద్కర్ గురించి సీఎం కేసీఆర్ ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు…రాజ్యాంగం పై చర్చ జరగాలి అన్నారని వివరించారు.

తెలంగాణ హైకోర్టులో ఒక్క దళిత న్యాయమూర్తి లేడు. ఎందుకు లేడు మరి అర్థం చేసుకోవాలి. దళిత బంధు,రైతు బంధు పై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి అందుకే తమ  పార్టీ కి పుట్టగతులు ఉండవని బీజేపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

న్యాయ వ్యవస్థ లో కూడా రిజర్వేషన్లు పెట్టాల్సిన అవసరం ఉందని, జై భీం అనే పదం మాట్లాడాటానికి బీజేపీకి  హక్కు లేదు…అంబేద్కర్ ను తాకే హక్కు కూడా లేదన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు పెట్టాల్సిన పని ఉందన్నారు. 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వమని, దండలు వేసుడు కాదు….దళిత జాతికి ఎం చేశారో బీజేపీ నేతలు చెప్పాలని మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు.

Also Read : లేడికి లేచిందే పరుగు

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com