Russia Attacks On Ukraine :
ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలయ్యాయి. ఉక్రెయిన్ ఆధీనంలోని స్తన్యత్సియా లుహన్సకలోని దోన్బాస్ లోని ఓ స్కూల్ పై రాకెట్ దాడి జరిగినట్టు అమెరికా ప్రకటించింది. ఇద్దరు టీచర్స్ కు గాయాలయ్యాయని, ఆ గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. రష్యా దాడి హేయమైనదని, మిన్స్క్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అమెరికా విమర్శించింది.
అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను రష్యా పట్టించుకోవటం లేదని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా తీరు చూస్తుంటే ఉక్రెయిన్ పై దురాక్రమణకు సిద్దమైనట్టు కనిపోస్తోందని శ్వేతసౌధం వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్ కు ఉత్తరాన బెలారస్ నుంచి దక్షిణాన క్రిమియా వరకు లక్షన్నర సైన్యాన్ని మోహరించిన రష్యా తగిన మూల్యం చెల్లించక తప్పదని అమెరికా హెచ్చరించింది. అయితే ఈ దాడి చేసింది ఉక్రెయిన్ వ్యతిరేఖ వర్గాల పని అని, రష్యా దాడి చేయలేదని కొన్ని వార్తా సంస్థలు, చానెల్స్ లో కథనాలు వస్తున్నాయి.