విజయ్ హజారే ట్రోఫీలో నేడు ఓ సంచలనం నమోదైంది. మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు కొట్టి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. ఉత్తర ప్రదేశ్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో స్పిన్నర్ శివ సింగ్ వేసిన 49వ ఓవర్లో రుతురాజ్ ఈ అద్భుతం తన పేరిట లిఖించుకున్నాడు. తొలి నాలుగు తొలి నాలుగు బంతుల్ని నాలుగు సిక్సులు కొట్టాడు. ఐదో బంతిని కూడా స్టాండ్స్ లోకి పంపాడు. అయితే ఇది నోబాల్ కావడంతో అదనపు పరుగుతోపాటు మరో ఎక్స్ ట్రా బంతి కూడా వచ్చింది. దాన్ని కూడా సిక్సర్ కొట్టాడు. చివరి బంతిని కూడా సిక్స్ కొట్టి ఏడోసిక్సర్ సాధించాడు.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం బి గ్రౌండ్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో యూపీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రుతురాజ్ 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో 220 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అజీం కాజి, బావ్నే చెరో 37 పరుగులు చేయడంతో నిర్ణీత 50ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ జట్టులో ఆర్యన్ జుయాల్ ఒక్కడే రాణించి 143 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లతో 159 పరుగులు చేశాడు. 47.4 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీనితో మహారాష్ట్ర 58 పరుగులతో విజయం సాధించింది.
మహారాష్ట్ర తో పాటు సౌరాష్ట్ర, అస్సాం, కర్నాటక జట్లు సెమీస్ కు చేరుకున్నాయి. 30న బుధవారం జరగనున్న సెమీస్ మ్యాచ్ ల్లో మహారాష్ట్ర-అస్సాం; కర్ణాటక-అస్సాం జట్లు తలపడనున్నాయి.
ఫైనల్ శుక్రవారం డిసెంబర్ 2 న జరగనుంది.