Monday, February 24, 2025
HomeTrending Newsపోడు భూములకు రైతు బంధు - కెసిఆర్

పోడు భూములకు రైతు బంధు – కెసిఆర్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పోడు భూములపై మాట్లాడిన కేసీఆర్.. గిరిజనులకు శుభవార్త చెప్పారు. దాంతో పాటు కొన్నిషరతులు కూడా వివరించారు. ఇక పోడు భూములకు పట్టాలే కాకుండా.. వారికి రైతుబంధు కూడా అందిస్తామని కేసీఆర్ సభాముఖంగా తెలిపారు. ఫిబ్రవరిలోనే 11 లక్షల ఎకరాల పోడు భూముల పంపిణీ చేస్తామని తెలిపారు. పోడు భూములు పంపిణీ చేసి..వారికి కూడా రైతు బంధు కూడా ఇస్తామని ప్రకటించారు. పోడు భూములపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని…ఇవాళ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు భూములు గిరిజనుల హక్కు కాదు… అటవీ సంపద కపాడాలా.వద్దా..? అని ప్రశ్నించారు.

అడవుల పునరుజ్జీవన ప్రక్రియ పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోడు భూములపై మాకు చిత్త శుద్ది వుందని.. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వెల్లడించారు. దాదాపు 66లక్షల ఎకరాలు ఉన్నాయని.. అన్ని స్టేజి లో సర్వేలు జరిగాయన్నారు.

ఇప్పటికిప్పుడు పోడు భూముల పంపిణీ చేయమమని.. అడవులు నరకం అని ప్రభుత్వానికి హామీ ఇస్తేనే పోడు భూములు ఇస్తామని చెప్పారు. అడవులు కొట్టేసి మాకు ఇవ్వమంటే హక్కు కాదని… అయినా గిరిజనుల శ్రేయస్సు కోరి  ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 11లక్షల ఎకరాలు పంపిణీ చేస్తామని..అఖిల పక్ష సమావేశం తర్వాత భూముల పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్