Saami Saami Song From Pushpa Created Records In Highest Views :

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప: ది రైజ్ సినిమాలోని మూడో పాట సామీ సామీ ఈ మధ్య విడుదలైంది. అత్యధిక వ్యూస్ అత్యంత వేగంగా సాధించిన పాటగా సౌత్ ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించింది సామి సామి సాంగ్. విడుదలైన 24 గంటల్లోనే 9 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలో కొత్త రికార్డు సృష్టించింది. మరే లిరికల్ వీడియోకు అయినా 24 గంటల్లో వచ్చిన అత్యధిక వ్యూస్ ఇవే.

పుష్ప సినిమాలోని మొదటి పాట దాక్కో దాక్కో మేక 24గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు ఆ రికార్డును సామీ సామీ తిరగరాసింది. అత్యధిక వ్యూస్ సాధించిన మొదటి 6 టాలీవుడ్ లిరికల్ వీడియో సాంగ్స్ లో 4 అల్లు అర్జున్ ఖాతాలో ఉన్నాయి. ఇందులో మొదటి రెండు స్థానాల్లో సామి సామి, దాక్కో దాక్కో మేక ఉన్నాయి. ఆ తర్వాత రాములో రాముల (7.37 million views),  శ్రీవల్లి (7 million views) లిరికల్ వీడియోలు ఉన్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న విడుదల కానుంది.

Must Read :పుష్ప తొలి పాట ‘దాక్కో దాక్కో మేక’ ఆల్ టైమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *