Tuesday, February 25, 2025
Homeసినిమాశబరి విశాఖ షెడ్యూల్ పూర్తి

శబరి విశాఖ షెడ్యూల్ పూర్తి

టాలీవుడ్ హ్యాపెనింగ్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘శబరి‘, అనిల్ కాట్జ్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా మూడో షెడ్యూల్ విశాఖలోని ఆర్కే బీచ్, సిరిపురం జంక్షన్‌తో పాటు అరకు లాంటి అందమైన లొకేషన్లలో షూటింగ్  పూర్తి చేసుకుంది. ప్రధాన తారాగణంపై కొన్ని యాక్షన్ సీక్వెన్సులు, ఒక పాట, కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.  నాలుగో షెడ్యూల్ ఈ నెలలో హైదరబాద్‌లో మొదలు కానుంది. దీనితో చిత్రీకరణ పూర్తవుతుంది. ఈనెల చివరి వారంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి.

అనిల్ కాట్జ్ మాట్లాడుతూ… వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంపిక చేసుకునే చిత్రాలు భిన్నంగా ఉంటాయి. మా శబరి కూడా అటువంటి భిన్నమైన చిత్రమే. శబరి పాత్రను నిజ జీవితంలో కూడా ధైర్యంగా ఉండే వ్యక్తి  చేస్తే బాగుంటుందని అనుకుంటున్న తరుణంలో వరలక్ష్మి గారు ఈ కథ వినటం, సినిమా చేయడానికి ఒప్పుకోవడం మా అదృష్టం. ఈ చిత్రంలో స్వతంత్ర భావాలున్న యువతిగా ఆమె కనిపిస్తారు. యాక్షన్ ఎపిసోడ్స్ లో చాలా ఎఫెక్టివ్ గా పెర్ఫార్మ్ చేశారు. అన్ని హంగులున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకు వద్దామా అని ఎదురు చూస్తున్నాం అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్