అల్లు అర్జున్, సుకుమార్ వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2, పుష్ప చిత్రాలు రూపొందాయి. అయితే.. ‘పుష్ప’ చిత్రం మాత్రం అందరి అంచనాలకు మించి పెద్ద సక్సెస్ సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. దీంతో ‘పుష్ప 2’ సినిమా పై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల షూటింగ్ స్టార్ట్ అయ్యింది. వైజాగ్ లో అల్లు అర్జున్ పై ఇంట్రో సాంగ్ చిత్రీకరించారు. విదేశాల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు.
ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలో సాయిపల్లవి నటించనుందని వార్తలు వచ్చాయి. గిరిజన అమ్మాయి పాత్ర పోషిస్తుందని ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి సాయిపల్లవి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాలో నటించేందుకు సాయిపల్లవి ఓకే చెప్పిందని.. 10 రోజులు డేట్స్ ఇచ్చిందని టాక్ బలంగా వినిపించడంతో పుష్ప 2 లో సాయిపల్లవి నటిస్తుందా..? ఇది నిజమా..? కాదా..? అనేది ఆసక్తిగా మారింది. మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఒక వేళ నిజమేనేమో అనుకున్నారు కానీ… ఇందులో సాయిపల్లవి నటించడం లేదని.. ప్రచారంలో ఉన్నది అవాస్తవం అని తెలిసింది.
ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పుష్ప సినిమా సంచలనం సృష్టించడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను తప్పకుండా అందుకుంటామని టీమ్ మెంబర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. వచ్చే సంక్రాంతికి లేదా సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరి.. అల్లు అర్జున్, సుకుమార్ కలిసి పుష్ప 2 తో సరికొత్త రికార్డులు సృష్టిస్తారేమో చూడాలి.
Also Read : ఈసారైనా ‘పుష్ప 2’ టీజర్ వస్తుందా..?