Sunday, January 19, 2025
HomeసినిమాSai Pallavi: సాయిపల్లవి ఈ సారి గ్యాప్ గట్టిగానే తీసుకుందే! 

Sai Pallavi: సాయిపల్లవి ఈ సారి గ్యాప్ గట్టిగానే తీసుకుందే! 

సాయిపల్లవికి తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఆమె సినిమాలకి మంచి మార్కెట్ కూడా ఉంది. సాయిపల్లవి పారితోషికం కంటే తన పాత్రకి ప్రాధాన్యతను ఇస్తుంది. తన పాత్ర మాత్రమే బాగుంటే చాలదు .. కథ మొత్తం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండాలని కోరుకుంటుంది. అందువల్లనే కథ విషయంలో ఆమెను ఒప్పించడం కొంత కష్టమైన విషయమే అనే టాక్ ఈ మూడు ఇండస్ట్రీల్లోను ఉంది. కథ నచ్చకపోతే చేయను అని చెప్పేస్తూ ఉంటుంది .. అవకాశాలు రాకపోతే అంటే, డాక్టర్ గా ప్రాక్టీస్ పెట్టుకుంటానని అనేస్తూ ఉంటుంది.

అందువల్లనే సాయిపల్లవి దగ్గరికి వెళ్లే దర్శకులు తమ కథల విషయంలో గట్టిగానే కసరత్తు చేసి వెళుతూ ఉంటారు. ఎందుకంటే ఫస్టు సిటింగులోనే ఆమెను ఒప్పించవలసి ఉంటుంది. మరోసారి ఆ కథను వినే ఆలోచన ఆమె చేయదని  అంటూ ఉంటారు. అందువల్లనే ఆమె ఇంతవరకూ చేసిన సినిమాలు తక్కువే .. అందుకున్న విజయాలు తక్కువే. అయినా ఆ పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ఆమె ఎక్స్ ప్రెషన్స్ .. డాన్స్ కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి.

‘లవ్ స్టోరీ’ .. శ్యామ్ సింగరాయ్’ వంటి హిట్స్ సాయిపల్లవి ఖాతాలో చేరాయి. ‘విరాటపర్వం’ సినిమా విషయంలోను నటన పరంగా ఆమెకి పడాల్సిన మార్కులు పడిపోయాయి. ఆ తరువాత నుంచి మాత్రం ఆమె నుంచి తెలుగు సినిమా లేదు. అందుకు కారణం కథలు నచ్చకపోవడమేనని అంటున్నారు. తెలుగు నుంచి వరుస ఆఫర్లు అయితే వెళుతున్నాయట. కానీ తనని తాను కొత్తగా ఆవిష్కరించే కథలతో రమ్మని ఆమె చెబుతోందట. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ జోడీగా మాత్రం ఒక సినిమా చేస్తోంది. తెలుగు సినిమాకి సంబంధించి ఆమెను ఏ డైరెక్టర్ ఒప్పిస్తాడనేది చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్