Monday, February 24, 2025
HomeTrending Newsవిజయమ్మ రాజీనామా వార్తలు నిజం కాదు: సజ్జల

విజయమ్మ రాజీనామా వార్తలు నిజం కాదు: సజ్జల

false news: పార్టీ గౌరవాధ్యక్షురాలు పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు.  విజయమ్మ ప్లీనరీకివస్తున్నారని, రెండ్రోజుల కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారని సజ్జల స్పష్టం చేశారు. మూడేళ్ళ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాబోయే రెండేళ్లలో ఎలాంటి  కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై సమగ్రంగా  చర్చిస్తామన్నారు. తమది చేతల ప్రభుత్వమని, మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, మాటలు తక్కువగా ఉండి చేతలు ఎక్కువగా ఉంటాయన్నారు. ప్రజా సేవకు పునరంకితమవుతామని వెల్లడించారు. ప్రజల బాగోగులు ఇంకా ఎలా చేయాలో, మరింత అభ్యుదయంగా ఎలా ఉండాలో చర్చిస్తామన్నారు.

పార్టీ నియమావళి లో మార్పులు ఉంటాయని, కీలకమైన అంశాలపై తీర్మానాలు చేస్తామని వివరించారు.  ప్లీనరీకి రావాల్సిందిగా డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెస్తున్నట్లు టిడిపి చేస్తున్న  ప్రచారాన్ని సజ్జల తీవ్రంగా తప్పుబట్టారు. ఇది పూర్తిగా అవాస్తవమని,  ఇంత పెద్ద ప్రాంగణంలో మీడియా వెళ్లి ఎక్కడైనా పరిశీలించవచ్చని సవాల్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్