Saturday, November 23, 2024
HomeTrending NewsViveka Case: అదో కల్పిత కథ: సజ్జల

Viveka Case: అదో కల్పిత కథ: సజ్జల

వైఎస్‌ వివేకా హత్య కేసులో కొంతమంది గుంటనక్కలు సీబీఐ దర్యాప్తును వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.  ఎల్లో మీడియా ఉగ్రవాదుల కంటే ఎక్కువ బెదిరింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.  కల్పితమైన కథ సీబీఐ చార్జీషీట్ లో కనిపిస్తోందని, ఎల్లో మీడియా, టీడీపీకి మసాలతో అవసరమైన సరుకుగా చార్జ్‌ షీట్ ఉపయోగపడుతుందని అనుమానం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

సజ్జల మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా చార్జ్‌ షీట్ దాఖలు చేసిందో చూస్తూనే ఉన్నాం
  • దర్యాప్తు సంస్థల చరిత్రలో వివేకా హత్య కేసు విచారణ మచ్చుతునక
  • వివేకానంద రెడ్డి చుట్టూ ఉన్న వాళ్లే హత్య చేసి ఉండొచ్చు ఇదే మా అనుమానం
  • కథ ఎలా మలుపు తిరగాలంటే దానికి తగ్గట్లు ఒక స్టేట్ మెంట్
  • నాలుగేళ్ల తరువాత కొత్త కథ అల్లారు, సునీతను ప్రెస్ మీట్ పెట్టాలని నేను చెప్పలేదు
  • సునీత ఇప్పటి వరకు ఆరేడు స్టేట్ మెంట్లు ఇచ్చారు
  • అవినాష్ రెడ్డి వైపు వేలు చూపేందుకు దస్తగిరిని అప్రూవర్ గా మార్చారు
  • అధారాలు అన్ని ఒక వైపు చూపిస్తుంటే.. దర్యాప్తు మరోవైపు సాగింది
  • వివేకా హత్య కేసులో దోషులు బయటకు రావాలని మొదటి నుంచి కోరుతున్నాం
  • చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్‌మెంట్లు ఇచ్చారు, సునీతకు వాళ్లే సలహాదారులు
  • అవినాష్‌ రెడ్డికి ఎంపీ టికెట్ 2011లోనే ప్రకటించారు
  • ఆ రోజున కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షం కలిసి కట్టుగా సీఎం జగన్‌ను ఓడించాలని చూశారు
  • కడప ఉప ఎన్నికల సమయంలో చిన్నాన్న వైఎస్‌ వివేకాపై జగన్  పరుషంగా మాట్లాడనివ్వ లేదు
  • వివేకా వస్తే సాదరంగా పార్టీలోకి జగన్ ఆహ్వానించారు
  • చనిపోయే సమయానికి పార్టీకి పెద్ద దిక్కుగా వివేకా ఉన్నారు
  • అందరీ దగ్గర సీబీఐ వాంగ్మూలం తీసుకున్నాక దస్తగిరి అప్రూవర్‌గా మారాడు
  • ల్యాండ్ సెటిల్ మెంట్‌తో వచ్చేదిలేదని ఎర్ర గంగిరెడ్డికి ముందే తెలుసు
  • శివ ప్రకాష్ రెడ్డి బెదిరించాడని షమీమ్ స్టేట్‌మెంట్ఇస్తే ఆ కోణంలో సీబీఐ దర్యాప్తు చేయలేదు
  • జర్నలిజంపేరుతో కొంత మంది ఉగ్రవాదుల కంటే దారుణంగా తయారయ్యారు
  • సీఎం జగన్‌ను ఎదుర్కోలేకేఈ  కుట్రలు,  2024 ఎన్నికల వరకు ఏదోవిధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు
  • రామ్ సింగ్ దారిలోనే సీబీఐ దర్యాప్తు సాగుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్