Sunday, September 8, 2024
Homeసినిమావరుస ప్రాజెక్టులతో సాక్షి బిజీ!

వరుస ప్రాజెక్టులతో సాక్షి బిజీ!

ప్రస్తుతం తెలుగులో పూజ హెగ్డే … రష్మిక … కీర్తి సురేశ్ స్టార్ హీరోయిన్స్ గా ముందు వరుసలో చక్రం తిప్పుతున్నారు. పూజ హెగ్డేకి వరుస ఫ్లాపులు పడినప్పటికీ, ఆమె క్రేజ్ .. మార్కెట్ పై అవి పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆ తరువాత వరుసలో  కృతి శెట్టి – శ్రీలీల కథానాయికలుగా రంగంలోకి దిగారు. అయితే వరుస ఫ్లాపులతో కృతి శెట్టి ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, వరుస అవకాశాలతో శ్రీలీల దూసుకుపోతోంది. ‘ధమాకా’ లాంటి హిట్లు ఒకటి రెండు పడితే, దాదాపు ముందు వరుసలోకి ఆమె వచ్చేస్తుంది.

ఇక ఆ తరువాత వరుసలో సంయుక్త మీనన్ – సాక్షి శివ కనిపిస్తున్నారు. సంయుక్త మీనన్ ఓ మూడు నాలుగు సినిమాలు చేసింది. ఆ సినిమాల్లో ఆమె చెప్పుకోదగిన పాత్రలు చేయకపోయినా, అవన్నీ భారీ విజయాలను సాధించడం ఆమె కెరియర్ కి కలిసొచ్చింది. సాయితేజ్ జోడీగా ‘విరూపాక్ష’తో మరో పెద్ద హిట్ ను ఆమె తన ఖాతాలో వేసుకుంది. ఇక ‘బ్రో’ .. ‘డెవిల్’ వంటి సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఒకటి రెండు కొత్త ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపిస్తోంది. అదీ స్టార్ హీరోల సరసన కావడం విశేషం.

సాక్షి వైద్య విషయానికి వస్తే, ‘ఏజెంట్’ సినిమాతో ఈ భామ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పరాజయం పాలైంది. కాకపోతే ఈ బ్యూటీ నాజూకుదనానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తరువాత సినిమాగా ఆమె ‘గాండీవధారి అర్జున’ చేస్తోంది. వరుణ్ తేజ్ జోడీగా ఆమె చేస్తున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్టు వెంటనే ఆమె సాయితేజ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఒక పెద్ద హీరో సినిమాలో రెండో నాయికగా సాక్షి పేరే వినిపిస్తోంది. చూస్తుంటే సంయుక్త – సాక్షి మధ్య గట్టి పోటీ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్