Sunday, January 19, 2025
HomeసినిమాSakshi Vaidya: ఇక ఇప్పుడు సాక్షి వైద్య వంతు వచ్చినట్టే!

Sakshi Vaidya: ఇక ఇప్పుడు సాక్షి వైద్య వంతు వచ్చినట్టే!

తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథనాయికలు పరిచయమవుతూనే వస్తున్నారు. అందం .. అభినయంతో పాటు అదృష్టం కూడా ఉన్నవారు ఇక్కడ నిలదొక్కుకుంటున్నారు .. స్టార్ హీరోయిన్స్ గా చక్ల్రం తిప్పేస్తున్నారు. అలా ‘ఏజెంట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు సాక్షివైద్య వచ్చేస్తోంది. ఇతర భాషల్లో హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన తరువాత టాలీవుడ్ కి పరిచయమైనవారు కొంతమంది అయితే, తెలుగుతోనే తమ ప్రయాణాన్ని మొదలుపెట్టిన హీరోయిన్స్ కొంతమంది.

అలా తెలుగు సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన హీరోయిన్ గా సాక్షి వైద్య కనిపిస్తుంది. మహారాష్ట్రకి చెందిన ఈ బ్యూటీ ఇంతవరకూ కొన్ని యాడ్స్ లో నటించింది .. అంతే తప్ప ఏ  భాషలో ఏ సినిమా కూడా చేయలేదు. ఇన్ స్టాలో ఆమెను చూసి ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్టుగా సురేందర్ రెడ్డి చెప్పాడు. మొదటి సినిమానే అయినా, చాలా బాగా చేసిందని ప్రమోషన్స్ లో చెప్పాడు. ఇక అఖిల్ కూడా అదే మాట చెబుతూ వస్తున్నాడు.

నిజానికి ఈ మధ్య కాలంలో చాలామంది కొత్త బ్యూటీలు టాలీవుడ్ కి పరిచయమయ్యారు. అనిఖ  సురేంద్రన్ .. గౌరీకిషన్ .. అతుల్య రవి .. ఆషిక రంగనాథ్ ఇలా కొంతమంది భామలు తెలుగు తెరపైకి వచ్చారు. అయితే వీళ్లలో ఎవరికీ హిట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో ‘ఏజెంట్’ సినిమాతో సాక్షి వైద్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. కోలముఖంతో .. కోలకళ్లతో కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టడంలో సక్సెస్ అయింది. అయితే తొలి సినిమాతోనే హిట్ కొడుతుందా లేదా అనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్