Saturday, September 28, 2024
Homeసినిమారిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న 'సలార్'

రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘సలార్’

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ, క్రేజీ మూవీ ‘సలార్‘. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ సైతం ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ పోస్టర్ అండ్ లుక్ సినిమా పై మరింతగా అంచనాలు పెంచేశాయి. ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా అంటే.. సలారే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతిహాసన్ నటిస్తుంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నారు.

ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నెలలో క్లైమాక్స్ చిత్రీకరించనున్నారు. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా వైరల్ అవుతుంది.ఇదిలా ఉండగా… ఇంకా రిలీజ్ కాక ముందే ఈ సినిమా మూవీ లవర్స్ లో అదరగొడుతుంది. గతంలో సినిమా రిలీజ్ కి చాలా టైం ఉండగానే కేజీఎఫ్ 2 బుక్ మై షో లో లక్ష కి పైగా ఇంట్రెస్ట్స్ ని సంపాదించుకుంది. ఇప్పుడు అదే విధంగా సలార్ పై కూడా లక్షకి పైగా ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. దీనితో సలార్ సినిమా కోసం ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఈ విధంగా రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తుంది.

ఇందులో శృతిహాసన్ జర్నలిస్ట్ గా నటిస్తుది. ఇటీవల శృతిహాసన్ తన షూటింగ్ వర్క్ కంప్లీట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి అంటున్నారు. రెండు పార్టులుగా తీయాలి అనుకున్నారు కానీ.. సలార్ మూవీని ఒక పార్ట్ గానే తీయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రేజీ మూవీని సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. మరి… బాహుబలి హీరో, కేజీఎఫ్ డైరెక్టర్ కలిసి ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ సాధిస్తారో చూడాలి.

Also Read: సలార్ రెండు పార్టులా..? ఒకటే పార్టా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్