Saturday, January 18, 2025
HomeసినిమాShah Rukh Khan Vs Prabhas: షారుఖ్ తో పోటీకి సై అంటున్న సలార్

Shah Rukh Khan Vs Prabhas: షారుఖ్ తో పోటీకి సై అంటున్న సలార్

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ, క్రేజీ చిత్రం సెప్టెంబర్ 28న రిలీజ్ కావాలి కానీ.. విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ కాకపోవడం.. కొన్ని సీన్స్ రీషూట్ చేయాల్సి రావడంతో సలార్ వాయిదా పడింది. ఎప్పుడెప్పుడు సలార్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తారా..? అని ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు.. సినీ అభిమానులు అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సలార్ న్యూ రిలీజ్ డేట్స్ నవంబర్ 10, డిసెంబర్ 20, జనవరి 12 అంటూ మూడు డేట్స్ ప్రచారంలోకి వచ్చాయి.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. డిసెంబర్ 22న సలార్ సినిమాని రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారట. ఈ మేరకు ఎగ్జిబిటర్స్ లకు నిర్మాత నుంచి మెయిల్ వచ్చిందని సమాచారం. ఈ శుక్రవారం సలార్ రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించి ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు డంకీ అనే సినిమా చేస్తున్నారు. రాజ్ కుమార్ హిరాణి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 22నే రిలీజ్ చేయనున్నారు.

అంటే.. డిసెంబర్ 22న షారుఖ్ డండి, ప్రభాస్ సలార్ పోటీపడబోతున్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ అని చెప్పచ్చు. షారుఖ్ తో సలార్ ప్రొడ్యూసర్స్ పోటీపడడం ఇది రెండోసారి. గతంలో షారుఖ్ జీరో, హాంబేలే ఫిల్మ్స్ కేజీఎఫ్ ఒకేసారి బాక్సాఫీస్ ముందుకు వచ్చాయి. అప్పుడు కేజీఎఫ్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఎవరు విన్నర్ గా నిలుస్తారు..? ఈ రెండు భారీ చిత్రాలు పోటీకి సై అంటాయా..? లేక రెండు సినిమాల రిలీజ్ మధ్య గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తారా..? ఏం జరగనుంది అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్